నటుడు సత్యరాజ్ కూతురుని ఎప్పుడైనా చూశారా..!!

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు రంగరాజు సుబ్బయ్య. అయితే ఈ పేరు చెబితే ఎవరు టక్కున గుర్తుపట్టలేరు కానీ బాహుబలి సినిమాలో నటించిన కట్టప్ప అంటే ప్రతి ఒక్కరు గుర్తుపడతారు. ఇయనను ఎక్కువగా సత్యరాజ్ అని పిలుస్తూ ఉంటారు. తెలుగు, తమిళ భాషలలో విలక్షణమైన పాత్రలలో నటిస్తూ బిజీ ఆర్టిస్టుగా పేరు పొందారు సత్యరాజు. సత్యరాజ్ కెరియర్ లో ఎన్నో విభిన్నమైన చిత్రాలలో నటించి మంచి పేరు సంపాదించారు.

తమిళంలో ఒక స్టార్ హీరో రెబల్ స్టార్ గా కూడా ఒక వెలుగు వెలిగారని చెప్పవచ్చు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో హీరోగా నటించిన ఈయన గతంలో.. దర్జా దొంగ, కూని, ఉక్కుసంఖ్యలు వంటి సినిమాలలో హీరోగా నటించారు. ఇక సత్యరాజ్ కుటుంబం గురించి ప్రేక్షకులకు చాలా తక్కువగానే తెలిసి ఉండవచ్చు. ముఖ్యంగా ఈయన భార్య పేరు మహేశ్వరి. వీరికి ఇద్దరు సంతానం సత్యరాజు కొడుకు సిబిరాజ్ ఈయన కూడా పలు సినిమాలలో నటించారు.

డోరా , మయోన్ లాంటి చిత్రాలలో నటించారు.సత్యరాజు కూతురు దివ్య కూడా న్యూట్రిషనిస్ట్. ఈమె ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో చాలా ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన పలువురు అభిమానుల సైతం హీరోయిన్ ను పోలిన అందంతో సత్యరాజ్ కూతురు ఉందంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా సత్యరాజ్ మరి రాబోయే రోజుల్లో తన కూతురిని హీరోయిన్ గా పరిచయం చేస్తారేమో చూడాలి మరి.

Read more RELATED
Recommended to you

Exit mobile version