ట్రెండ్ ఇన్: తెలుగు చిత్రసీమలో ప్రయోగాలకు కేరాఫ్ కృష్ణ..అరుదైన రికార్డులు సూపర్ స్టార్ సొంతం

-

తెలుగు చిత్ర సీమలో ప్రయోగాలకు కేరాఫ్ టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ అని చెప్పొచ్చు. డేరింగ్, డ్యాషింట్ నిర్ణయాలతో తెలుగు సినీ పరిశ్రమలో సరి కొత్త టెక్నాలజీతో సినిమాలు తీసిన హీరో నటశేఖర కృష్ణ. ఆయన 79వ పుట్టిన రోజు మంగళవారం. కాగా, కృష్ణ-మహేశ్ అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్తున్నారు.

తమ అభిమాన కథానాయకుడు కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఆయన సాధించిన అరుదైన రికార్డుల గురించి ట్వి్ట్టర్ వేదికగా వరుస ట్వీట్స్ చేస్తున్నారు. #HBDLegendarySSK హ్యాష్ ట్యాగ్ హెచ్ బీడీ లెజెండరీ ఎస్ఎస్‌కే అని ట్వీట్స్ చేస్తున్నారు. అలా అభిమానుల వరుస ట్వీట్లతో సదరు హ్యాష్ ట్యాగ్ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ లో ట్రెండింగ్ లోకి వచ్చేసింది.

ముప్పై ఏళ్ల నట జీవితంలో కృష్ణ 317కు పైగా చిత్రాల్లో నటించారని వివరిస్తున్నారు. ఒక ఏడాదిలో అనగా 1972లో కృష్ణ నటించిన 18 చిత్రాలు విడుదల కావడం విశేషం. తొలి సోషల్ కలర్ సినిమా ‘‘తేనె మనుసులు’’ కృష్ణ నటించిన సినిమా కాగా, తొలి జేమ్స్ బాండ్ చిత్రం ‘‘గూఢచారి 116’’, తొలి కౌబాయ్ చిత్రం ‘‘మోసగాళ్లకు మోసగాడు’’, తొలి ఈస్ట్ మాన్ చిత్రం ‘‘ఈనాడు’’, తొలి 70 ఎంఎం చిత్రం ‘‘సింహాసనం’’, తొలి డీటీఎస్ చిత్రం ‘‘తెలుగు వీర లేవరా’’ తెలుగు సినిమా స్కోప్ ఫిల్మ్ ‘‘అల్లూరి సీతారామరాజు’’..ఇలా అన్ని తొలి ప్రయోగాలకు సూపర్ స్టార్ కృష్ణనే కేరాఫ్ కావడం విశేషం.

సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు మే 31న ఆయన తనయుడు..మహేశ్ బాబు తను నటించే చిత్ర అప్ డేట్స్ ఇస్తుంటారు. ఈ నేపథ్యంలోనే మహేశ్ – త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న SSMB 28, రాజమౌళి-మహేశ్ కాంబలో రాబోతున్న SSMB 29 ఫిల్మ్స్ అప్ డేట్ కోసం అభిమనులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version