అలాంటి వీడియోలు పంపి నరకం చూపించేవాడు.. కేజిఎఫ్ నటి..!

-

ఒకప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన రవీనా టాండన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు . తెలుగులో కూడా కొన్ని చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈమె.. ఆ తర్వాత ఆకాశ వీధిలో, పాండవులు పాండవులు తుమ్మెద వంటి సినిమాలు లో కూడా రవీనా టాండన్ నటించింది. ప్రస్తుతం 47 సంవత్సరాల వయసులో కూడా చెక్కుచెదరని గ్లామర్ తో కుర్ర కారుమతి పోగోడుతున్న ఈమె ఇటీవల వచ్చిన పాన్ ఇండియా సినిమా కేజిఎఫ్ 2 లో కూడా నటించిన విషయం తెలిసిందే. అక్కడ తన నటనతో విపరీతమైన ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది.

ఇందులో ప్రధానమంత్రి పాత్రలో నటించిన రవీనా టాండన్ చాలా రోజుల తర్వాత ఒక పవర్ఫుల్ రోల్ ప్లే చేసిందని చెప్పాలి . ఈ చిత్రంలో రవీనా నటనకి ప్రశంసలు కూడా దక్కాయి. ఇదిలా వుండగా 90వ దశకంలో రవీనా టాండన్ బాలీవుడ్లో క్రేజీ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది . అదే సమయంలో ఎన్నో అవమానాలను, ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నట్లు ఆమె పలు ఇంటర్వ్యూలలో తెలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఈ విషయాలు వెల్లడించారు.. గ్లామర్ నటన ఉండడంతో రవీనాకు చాలా మంది అభిమానులు ఉండేవారు. అందులో ఒక అభిమాని మితిమీరి ప్రవర్తించాడు.. ఆమెకు రక్తంతో ప్రేమలేఖలు, నగ్న వీడియోలు కూడా పంపేవాడట . ఆ అభిమాని ప్రవర్తన వల్ల నరకం చూశాను.. దీంతో పోలీసులకు కూడా ఫిర్యాదు చేయక తప్పలేదు అంటూ రవీనా తెలిపింది.

అంతేకాదు తన ఇంటి వద్ద రెక్కీ నిర్వహించేవాడు, తన ప్రేమను ఒప్పుకోవాలని టార్చర్ చేసేవాడట, అలాగే ఫ్యామిలీతో బయటకు వెళ్లినప్పుడు కారుపై రాయి కూడా వేశాడట. తన ప్రేమను ఒప్పుకోవాలని గట్టిగా అరిచాడట. ఈ విషయాలన్నీ చెప్పుకొని తన అభిమాని ప్రవర్తనను చూసి తానే ఆశ్చర్యపోయినట్లు రవీనా తెలిపింది. ఇలా ఎన్నో విషయాలలో తాను మానసికంగా కూడా ఇబ్బంది పడ్డాను అని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version