బిగ్ బాస్ 2 విజేత, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఎల్విష్ యాదవ్ ఇంటిపైన దుండగులు కాల్పులు జరిపారు. తెల్లవారు జామున 5:30 గంటల సమయంలో గురుగ్రామ్ లోని ఎల్విష్ యాదవ్ నివాసం ఉంటున్న ఇంటిపై ముగ్గురు దుండగులు కాల్పులు జరిపారు. ఏకంగా 12 రౌండ్లు కాల్పులు జరిపి పారిపోయారు. కాగా దాడి సమయంలో ఎల్విష్ యాదవ్ తన ఇంట్లో లేరని పోలీసుల విచారణలో తేలింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

దుండగులు ఎవరో తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. పోలీసుల విచారణ అనంతరం ఎల్విష్ యాదవ్ ఇంటి పైన కాల్పులు జరిపిన వ్యక్తులు ఎవరో తెలియనుంది. ప్రస్తుతం వారిని పట్టుకునే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. ప్రస్తుతం పోలీసులు ఎల్విష్ యాదవ్ ను విచారిస్తున్నారు. కాల్పులకు గల కారణాలను తెలుసుకుంటున్నారు. ఎవరైనా శత్రువులు ఉన్నారా లేదా తెలియనివారే ఇలా చేశారా అని ప్రశ్నిస్తున్నారు. ఇంతకుముందు ఎవరైనా ఇలా చేశారా అని ప్రశ్నిస్తున్నారు. ఈ సంఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.