బురఖా లో హెబ్బా పటేల్.. షాక్ లో అభిమానులు!

-

హెబ్బా పటేల్.. టాలీవుడ్ ప్రేక్షకులందరికీ అత్యంత సుపరిచితమైన పేరు. 2015 లో సుకుమార్ నిర్మాణంలో వచ్చిన కుమారి 21ఎఫ్ సినిమాతో మంచి పేరు సంపాదించుకున్నారు. రాజ్ తరుణ్ కు జోడిగా ఈ సినిమాలో హెబ్బా పటేల్ అలరించారు. ఈ సినిమా విజయంతో హెబ్బా పటేల్ కు అవకాశాలు క్యూ కట్టాయి ఆమె క్యూట్ లుక్స్ తో పాటు నటనకు ఫిదా అయిపోయారు టాలీవుడ్ సినీ ప్రియులు.

టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక పేరు సంపాదించుకున్న హీరోయిన్ హెబ్బా పటేల్ ఇప్పటివరకు పలు సినిమాల్లో నటించినప్పటికీ ఆమె బ్యాగ్రౌండ్ ఏంటో ఎవరికి తెలియదు తాజాగా హెబ్బా పటేల్ ను బురకా లో చూసి అభిమానులంతా షాక్ అవుతున్నారు. హెబ్బా పటేల్‌ ముస్లిం అని రీసెంట్ గా ఆమె బుర్ఖా వేసుకునేవరకూ తెలియలేదు ఎవరికీ. ప్రస్తుతం రంజాన్‌ నెల కావడంతో ఆమె బురఖా ధరించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో పోస్టు చేసింది.

ఇవి చూసి నెటిజన్లు ఇది నిజమేనా అంటూ గూగుల్ లో హెబ్బా పటేల్ బ్యాక్ గ్రౌండ్ ను చెక్ చేస్తున్నారు. పటేల్ అని పేరు చివర ఉండటంతో కన్ఫ్యూజన్ లో పడిపోతున్నారు. ఒక వేళ వారి తల్లి తండ్రులు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుని ఉంటారా.. అంటూ ఆరా తీయగా హెబ్బా పటేల్ కన్నడ మాట్లాడే.. ముస్లిమ్ కుటుంబం నుంచి వచ్చినట్టు తెలుస్తోంది. కాగా ఇప్పటి వరకూ హెబ్బా పక్కన పటేల్ ఉండటంతో ఆమెను ఏ గుజరాతీ అమ్మయో అనుకున్నారంతా. కాని ఆమె కన్నడ పిల్ల అని చాలా తక్కువ మందికి తెలుసు. ఏది ఏమైనా.. హెబ్బా బురఖా ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాగా కుమారి 21ఎఫ్ చిత్రంతో విజయాన్ని అందుకున్నప్పటికీ హెబ్బా పటేల్ యొక్క కెరియర్ పెద్దగా సక్సెస్ సాధించలేకపోయింది. ఆమె తరువాత నటించిన చిత్రాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి. కానీ హెబ్బా పటేల్ ప్రస్తుతం ఐటమ్ సాంగ్స్, కొన్ని కొత్త చిత్రాల్లో నటిస్తూ ఎల్లప్పుడూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది

Read more RELATED
Recommended to you

Exit mobile version