ఐపీఎల్ 16వ సీజన్ 23వ మ్యాచ్‌లో గుజరాత్ టైటన్స్ రాజస్థాన్ రాయల్స్ తలపడుతున్నాయి. ఇరుజట్లు విజయంపై కన్నేశాయి. దాంతో, ఈ పోరు ఆసక్తికరంగా ఉండనుంది. ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఐపీఎల్ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ కోసం రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ తలపడేందుకు రెడీ అయ్యాయి. ఈ రెండు జట్లు బలంగానే కనిపిస్తున్నాయి. తమ చివరి మ్యాచుల్లో ఘనవిజయాలు సాధించిన ఈ రెండు జట్లు.. అదే జోరు కొనసాగించి మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని అనుకుంటున్నాయి.
సంజూ శాంసన్ కూడా ఫామ్ అందుకుంటే రాజస్థాన్ మరింత బలంగా తయారవుతుంది.ఇక గుజరాత్ టైటాన్స్‌లో యష్ దయాళ్ స్థానంలో వచ్చిన మోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అతన్ని ఇప్పుడు పక్కన పెట్టడం అసాధ్యంగా కనిపిస్తోంది. అంతకుమించి గుజరాత్ జట్టులో ఎలాంటి మార్పులూ చేయకపోవచ్చు. గుజరాత్ కనుక ఛేజ్ చేయాల్సి వస్తే.. విజయ్ శంకర్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా తీసుకొనే ఛాన్స్ ఉంది.
గుజరాత్ టైటాన్స్: హార్దిక్ పాండ్యా (సి), శ్రీకర్ భరత్, అల్జారీ జోసెఫ్, జోష్ లిటిల్, అభినవ్ మనోహర్, డేవిడ్ మిల్లర్, మహ్మద్ షమీ, దర్శన్ నల్కండే, నూర్ అహ్మద్, ఉర్విల్ పటేల్, రషీద్ ఖాన్, వృద్ధిమాన్ సాహా, ఆర్ సాయి కిషోర్, సాయి సుదర్శన్, ప్రదీప్ సాంగ్వాన్, దసున్ షనక, విజయ్ శంకర్, మోహిత్ శర్మ, శివమ్ మావి, శుభమన్ గిల్, ఒడియన్ స్మిత్, రాహుల్ తెవాటియా, మాథ్యూ వేడ్, జయంత్ యాదవ్, యశ్ దయాల్.
రాజస్థాన్ రాయల్స్: సంజూ శాంసన్ (సి), అబ్దుల్ బాసిత్, మురుగన్ అశ్విన్, రవిచంద్రన్ అశ్విన్, కెఎమ్ ఆసిఫ్, ట్రెంట్ బౌల్ట్, జోస్ బట్లర్, కెసి కరియప్ప, యుజ్వేంద్ర చాహల్, డోనోవన్ ఫెరీరా, షిమ్రాన్ హెట్మెయర్, జాసన్ హోల్డర్, యశస్వి జైస్వాల్, ఒబ్ద్రువ్ జురెల్, , దేవదత్ పడిక్కల్, రియాన్ పరాగ్, కునాల్ సింగ్ రాథోడ్, జో రూట్, నవదీప్ సైనీ, సందీప్ శర్మ, కుల్దీప్ సేన్, ఆకాష్ వశిష్ట్, కుల్దీప్ యాదవ్, ఆడమ్ జంపా.