రామ్ రెడ్ సినిమా రిలీజ్ ఎప్పుడంటే…!

-

రామ్ పోతినేని హీరోగా స్రవంతి కిషోర్ నిర్మాణ సారథ్యంలో తిరుమల కిషోర్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం రెడ్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా సూపర్ హిట్ తర్వాత ఈ సినిమా చేస్తున్నాడు రామ్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ నీ చిత్ర యూనిట్ విడుదల చేసింది. సోషల్ మీడియాలో దీనికి మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ప్రధానంగా రామ్ లుక్ కి అభిమానులు ఫిదా అయిపోయారు.

ఇదిలా ఉంటే ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది అనేది తాజాగా చిత్ర యూనిట్ ప్రకటించింది. ఏప్రిల్ 9 ఈ సినిమాను విడుదల చేయనున్నామని చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేసింది. వేసవి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా టైటిల్ కాస్త భిన్నంగా ఉండటంతో అసలు కథ ఏ విధంగా ఉంటుంది అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. రామ్ కి యూత్ లో క్రేజ్ ఎక్కువ.

ఈ సినిమాను కూడా యూత్ ని ఆకట్టుకునే విధంగా అనే దర్శకుడు తెరకెక్కించారని సమాచారం. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ తో సినిమా చేస్తాడా అనేది స్పష్టం కాలేదు. అయితే ఒక అగ్ర దర్శకుడి తో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనిపై కూడా స్పష్టత రావాల్సి ఉంది, ఈనెల 25 ఉగాది కానుకగా ఈ సినిమా పాటలను విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version