దక్షిణ భారతదేశానికి సంబంధించిన హీరో విశాల్ ఆరోగ్యం క్షీణించిన సంగతి తెలిసిందే. గతంలో కంటే ఆయన హెల్త్ పొజిషన్ చాలా ప్రమాదకరంగా మారింది. ఆయన ఏదో భయంకరమైన వ్యాధితో.. బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఇలాంటి నేపథ్యంలో హీరో విశాల్ హెల్త్ బులిటెన్ తాజాగా విడుదల చేశారు.
ఆయన హెల్త్ బులిటెన్ ను… చెన్నైకి చెందిన కొంతమంది వైద్య బృందం విడుదల చేయడం జరిగింది. ఆ చెన్నై వైద్యులు.. విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం… విశాల్ ప్రస్తుతం వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారని వాళ్లు తెలపడం జరిగింది. ఆయనకు ప్రస్తుతం చికిత్స అందిస్తున్నామని వివరించారు. విశాల్ పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రకటించారు. దీంతో ఆయన ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఆదివారం రోజున మదగజ రాజా సినిమా ప్రెస్ మీట్ లో కనిపించారు విశాల్. ఆ సందర్భంగా మాట్లాడుతూ…. విశాల్ గజగజ వణికిపోయారు. అప్పుడే అందరూ గ్రహించారు విశాల్ అనారోగ్యంగా ఉన్నాడని..! ఇలాంటి నేపథ్యంలోనే విశాల్ హెల్త్ బులిటెన్ రిలీజ్ చేశారు.