నిద్ర సరిగ్గా రావట్లేదా..? బెడ్ మీద వాలిపోయే ముందు ఈ ఆహారాలు తీసుకోండి

-

శరీరానికి నిద్ర సరిగ్గా ఉంటేనే అనవసర అనారోగ్యం ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. నిద్ర సరిగ్గా ఉంటే మెదడు చురుకుగా పనిచేస్తుంది. రోగనిరోధ శక్తి పెరుగుతుంది. ఒకరోజులో శరీరానికి కనీసం 7-8గంటల నిద్ర కావాలి.

కొంతమంది నిద్ర సరిగ్గా రాక అవస్థలు పడుతుంటారు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిని పక్కన పెడితే ప్రస్తుతం నిద్రకు ఉపక్రమింపజేసే కొన్ని ఆహారాల సంగతి చూద్దాం.

బాదం:

ఇందులో విటమిన్ బి, మెగ్నీషియం కావాల్సినంత ఉంటుంది. ఈ కారణంగా నిద్ర సులభంగా వస్తుంది. బాదం గింజలను రోజువారి డైట్ లో చేర్చుకుంటే మంచిది. అంతేకాదు, బాదం తినడం వల్ల నిద్రకు ఉపక్రమింపజేసే మెలటోనిన్ హార్మోన్ విడుదల అవుతుంది.

గోరువెచ్చని పాలు:

సాధారణంగా చిన్నపిల్లలకు రాత్రుళ్ళు గోరు వెచ్చని పాలు ఇస్తుంటారు. పాలల్లో ట్రిప్టోఫాన్, కాల్షియం, విటమిన్ డి ఉంటుంది. నిద్రరాక ఇబ్బంది పడేవాళ్ళు పాలు తీసుకోవడం మంచిదే. అయితే తక్కువ కొవ్వు కలిగిన పాలను తాగడం ఉత్తమం.

కివీ:

కివీ పండ్లలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి అధికంగా ఉంటుంది. దీన్ని రాత్రి పడుకునే ముందు తినడం వల్ల నిద్ర బాగా పట్టే అవకాశం ఉంది. ఇంకా చెప్పాలంటే.. కివీ పండ్ల వల్ల జీర్ణ శక్తి మెరుగుపడుతుంది.

చేపలు:

సాల్మన్, టూనా, మాకెరెల్ వంటి చేపల్లో విటమిన్ డి ఉంటుంది. ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు సైతం అధికంగా ఉంటాయి. వీటివల్ల మెదడు ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇంకా నిద్ర బాగా పడుతుంది.

గమనిక: ఈ సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది, కేవలం అవగాహన కోసం మాత్రమే. “మనలోకం” ధృవీకరించడలేదు. పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

Read more RELATED
Recommended to you

Exit mobile version