నవదీప్ తో రిలేషన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరోయిన్ అంకిత..!

-

ప్రముఖ హీరోయిన్ అంకిత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు హరికృష్ణ హీరోగా నటించిన లాహిరి లాహిరి లాహిరిలో అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె ఆ తర్వాత రాజమౌళి, ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన సింహాద్రి సినిమాలో కూడా నటించి మంచి పేరు దక్కించుకుంది. ఇక తర్వాత ప్రేమలో పావని కళ్యాణ్, ధనలక్ష్మి ఐ లవ్ యు వంటి చిత్రాలలో నటించి.. వరుసగా విజయాలను అందుకుంది.. ఇక విజయేంద్ర వర్మ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈమెకు ఈ సినిమా నిరాశ మిగిల్చిందనే చెప్పాలి. దాంతో 2009లో ఇండస్ట్రీకి దూరమైంది.

ఇక ఇన్ని రోజులు ఇండస్ట్రీలో ఎక్కడ కనిపించని అంకిత మొదటిసారి మీడియా ముందుకు వచ్చి వ్యక్తిగత విషయాలతో పాటు సినీ ఇండస్ట్రీలో ఉన్న నాటి తన జ్ఞాపకాలను కూడా పంచుకుంది. అంతేకాదు నవదీప్ తో ఎఫైర్ పై అలాగే గొడవలపై కూడా క్లారిటీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే హీరో నవదీప్ తో తనకు ఎలాంటి విభేదాలు లేవు అని.. నవదీప్ సరసన నటించిన చిత్రంతో పాటు తమిళంలో మరో సినిమా ఒకే సమయంలో చిత్రీకరణ సాగడంతో ఒత్తిడి ఫీల్ అయ్యాను.. ఆక్రమంలో అసహనానికి గురి అయ్యాను తప్ప ఎటువంటి గొడవ జరగలేదు అని ఆమె క్లారిటీ ఇచ్చింది.

అలాగే అప్పట్లో నవదీప్ తో అంకిత ఎఫైర్ విషయాలపై కూడా అసహనం వ్యక్తం చేస్తూ అటువంటివి ఏమీ లేవు అని క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇకపోతే ముంబైకి చెందిన అంకిత వ్యాపారవేత్త విశాల్ జగపతితో 2016లో వివాహం జరగగా.. వారు ఇప్పుడు న్యూ జెర్సీలో స్థిరపడ్డారు ప్రస్తుతం ఈ దంపతులకు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version