ఇటీవల నామినేటెడ్ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎంపికైన అద్దంకి దయాకర్ నేడు శాసనమండలి చైర్మన్ చాంబర్‌లో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. అద్దంకి చేత శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణం చేయించారు.ఈ వేడుకకు మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా అసెంబ్లీ లాబీలో అద్దంకి దయాకర్ మీడియాతో మాట్లాడుతూ.. మీ అందరి ఆశీస్సులతో చట్టసభలో ప్రవేశించే అవకాశం దక్కిందని.. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అని చెప్పారు. ప్రభుత్వ అధికారిగా ఉన్నా ప్రజలకు సేవకుడిగానే ఉంటానని వివరించారు. ఇకపై తనకు వచ్చే జీతంలో 25 శాతం పార్టీ కోసం ఖర్చు పెడతానని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ స్పష్టంచేశారు.