మీనాక్షి చౌదరి ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈమె ఓ డాక్టర్ అయినప్పటికీ సినిమాల మీద ఉన్న ఆసక్తితో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. అనేక సినిమాలలో నటించి సక్సెస్ సాధించిన ఈ చిన్నది రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సినిమానూ తన ఖాతాలో వేసుకుంది. ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించి ప్రేక్షకులను తన వైపుకు తిప్పుకుంది. అంతే కాకుండా హీరో వెంకటేష్ కు ఎక్స్ లవర్ పాత్రను పోషించింది. ఈ సినిమాలో వెంకటేష్ మీనాక్షి చౌదరి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలైట్ గా నిలిచాయని చెప్పవచ్చు.

ఈ సినిమా అనంతరం మీనాక్షి చౌదరి వరుసగా సినిమాలలో అవకాశాలను అందుకుంటుంది. ఇప్పటికే ఈ అమ్మడి చేతిలో మూడు నాలుగు సినిమా ప్రాజెక్టులకు పైనే ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. తెలుగులోనే కాకుండా ఈ చిన్నది తమిళంలోనూ అనేక సినిమాలలో అవకాశాలను అందుకుంటుంది. ఇదిలా ఉండగా…. మీనాక్షి చౌదరి తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం చేసుకుని బయటకు వస్తున్న సమయంలో కొంత మంది మీనాక్షి చౌదరి ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా అవి విపరీతంగా వైరల్ గా మారుతున్నాయి.