ముష్కరుల కాల్పుల్లో ఆర్మీ జవాన్ మృతి చెందాడు. జమ్మూ కశ్మీర్‌లోని బసంత్‌గఢ్‌లో జరుగుతున్న ఎన్కౌంటర్‌లో ఓ ఆర్మీ జవాన్ మృతి చెందాడు. అక్కడ ముష్కరులు ఉన్నారని సమాచారంతో బలగాలు ఆపరేషన్ చేపట్టగా, అది గమనించి కాల్పులు జరిపారు ముష్కరులు. ఈ ఎన్కౌంటర్‌లో ఆర్మీ సోల్జర్ వీర మరణం పొందారని తెలిపాయి భద్రతా వర్గాలు.

ప్రస్తుతం అక్కడ భీకర ఎన్కౌంటర్ కొనసాగుతుందని తెలిపాయి భద్రతా వర్గాలు. కాగా, జమ్ముకాశ్మీర్‌లోని పహెల్గాం జిల్లాలో ఉగ్రవేట కొనసాగుతోంది. ఉగ్రవాదుల కోసం ఆర్మీ, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) సంయుక్తంగా అడవులను జల్లెడ పడుతున్నాయి. పూంచ్, బారాముల్లా అడవులను శోధిస్తూ ఉగ్రవాదులు ఫారెస్ట్‌లో నక్కి ఉండవచ్చనే అనుమానంతో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఉగ్రవాదులను ఏరివేసే వరకు సెర్చ్ ఆపరేషన్ కొనసాగించనున్నట్లు అధికారవర్గాలు వెల్లడించాయి.