MBBS పరీక్షలు రాయనున్న హీరోయిన్‌ శ్రీలీల !

-

టాలీవుడ్​ మోస్ట్ హాప్పెనింగ్ హీరోయిన శ్రీలీల సోషల్ మీడియాలోనూ చాలా పాపులర్. ఈ భామ ప్రస్తుతం సినిమా షూటింగ్స్, ప్రమోషన్స్​తో బిజీబిజీగా ఉంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్​కు సంబంధించిన ఫొటోలను నెట్టింట షేర్ చేస్తోంది. ఈ భామ ఔట్​ఫిట్స్ చూసి అమ్మాయిలు అదరహో అంటున్నారు. ఇక శ్రీలీల అందం చూసి అబ్బాయిలు మాత్రం మనసు పారేసుకుంటున్నారు.

Heroine Srileela to write MBBS exams

అయితే.. చేతినిండా సినిమాలతో కెరీర్ పరంగా దూసుకెళ్తున్నారు నటి శ్రీలీల. ఓవైపు ఎంబీబీఎస్ చదువుతూనే మరోవైపు టాప్ హీరోల సరసన ఆఫర్స్ సొంతం చేసుకుంటూ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆమె ఓ వారం రోజులపాటు షూటింగ్ కు దూరం కానున్నట్లు టాక్. ఎంబీబీఎస్ ఫైనల్ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తున్నట్లు తెలుస్తోంది. శ్రీలీల ముంబైలో ఎంబీబీఎస్ చదువుతున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version