మీడియాపై నారాయణపేట ఎమ్మెల్యే పీఏ ఆగ్రహం..ఫుడ్ పాయిజన్ అని ఎలా రాస్తారంటూ?

-

నారాయణపేట జిల్లాలోని ధన్వాడ బాలుర ఉన్నత పాఠశాలలో భోజనం వికటించి 25 మంది విద్యార్థులకు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.వాంతులు, కడుపునొప్పితో విద్యార్థులు అవస్థ పడుతుండటంతో హుటాహుటిన వైద్యులను పాఠశాలకు పిలిపించి ఉపాధ్యాయులు వైద్యం అందించారు.

ఈ విషయాన్ని కవర్ చేసిన మీడియాపై నారాయణపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే పర్ణికారెడ్డి పీఏ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఫుడ్ పాయిజన్‌ అని ఎలా రాశారు? అంటూ మీడియాపై మండిపడ్డారు. ఫుడ్ పాయిజన్‌పై వార్త రాసిన విలేకర్లను ఫుడ్‌ పాయిజన్‌ అని మీరెలా నిర్ధారిస్తారు. విద్యార్థులకు అస్వస్థత అయితే భోజనం వికటించడం ఎలా అవుతుందని ఎమ్మెల్యే పర్ణికా రెడ్డి పీఏ మాధవ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని జర్నలిస్టు మిత్రులు తప్పబడుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version