నేనే చాలా కసిగా ఉన్నా..పెళ్లి వార్తలపై తమన్నా కామెంట్స్‌

-

గత కొన్ని రోజులుగా మిల్కీ బ్యూటీ తమన్నా పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఓ ప్రముఖ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతున్నట్లు అనేక మీడియా సంస్థలలో వార్తలు వచ్చాయి. దీనితో అందరూ ఆ వార్తలు నిజమేనని భావించారు. అయితే, తాజాగా తన పెళ్లి వార్తలపై హీరోయిన్ తమన్నా సంచలన వ్యాఖ్యలు చేసింది.

సత్యదేవ్ తో కలిసి నటించిన ‘గుర్తుందా శీతాకాలం’ రిలీజ్ సందర్భంగా హీరోయిన్ తమన్నా తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది. ‘నా పెళ్లి పై చాలా రూమర్లు వచ్చాయి. ఓ డాక్టర్ తో, బిజినెస్ మెన్ తో పెళ్లి అంటూ రాశారు. అవన్నీ తప్పు. పెళ్లి అనేది జీవితంలో అందమైన భాగం. అలాంటి సందర్భం వస్తే వేడుకల అందరికీ తెలిసేలా చేసుకుంటా. ఇక కెరీర్ మొదట్లో నటనపై ఎంత కసిగా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నా’ అని చెప్పుకొచ్చింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version