Nani 30 : “హాయ్ నాన్న” గా వచ్చేసిన నాని

-

నేచురల్ స్టార్ నాని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అయితే.. నేచురల్ స్టార్ నాని దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు తన నెక్స్ట్ మూవీ పనిలో బిజీగా ఉన్నాడు. ‘నాని 30’ అనే వర్కింగ్ టైటిల్తో జరుగుతున్న షూటింగ్ లో పాల్గొంటున్నాడు.

శౌర్యవ్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నాని సరసన ‘సీతారామం’ బ్యూటీ మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. ఈ మూవీ ఈ ఏడాది చివరికల్లా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే.. తాజాగా నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తన 30 వ సినిమాకు హాయ్‌ నాన్న అనే టైటిల్‌ ను తాజగా అనౌన్స్‌ చేసింది చిత్ర బృందం. ఈ మేరకు చిన్న గ్లింప్స్‌ వీడియోను కూడా రిలీజ్‌ చేశారు. ఇందులో నాన్న గురించి కొన్ని ఎమోషన్‌ సీన్స్‌ ఉన్నాయి. ఇది అందరినీ ఆకట్టుకుంటోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version