నటసింహ బాలకృష్ణ మొదటిసారి హోస్ట్ గా వ్యవహరిస్తున్న కార్యక్రమం అన్ స్టాపబుల్ విత్ NBK..గత ఏడాది ప్రారంభమైన ఈ కార్యక్రమం ఆహా ఓటీటీ ఛానల్ ద్వారా విశేషమైన స్పందన సొంతం చేసుకుంది. అంతేకాదు ఇండియాలోనే నెంబర్ వన్ టాక్ షో గా గుర్తింపు తెచ్చుకొని మంచి టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోయింది. ఇక మొదటి సీజన్ దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఆహా ఇప్పుడు రెండవ సీజన్ కూడా మొదలుపెట్టింది . శుక్రవారం రోజున అనగా అక్టోబర్ 14వ తేదీన ప్రముఖ ఓటీటీ ఆహాలో అన్ స్టాపబుల్ సీజన్ 2 ప్రసారం కాబోతోంది.. ఇక ఈ కార్యక్రమానికి మొదటి గెస్ట్ గా మాజీ ముఖ్యమంత్రి , బాలకృష్ణ బావ నారా చంద్రబాబు నాయుడు అలాగే ఆయన కొడుకు నారా లోకేష్ కూడా హాజరయ్యారు.
ఇక వీరంతా కలిసి షోని మరింత సందడిగా సాగించారని చెప్పవచ్చు. ఇక ఇందులో భాగంగానే అటు చంద్రబాబు ఇటు బాలకృష్ణ ఇద్దరూ కూడా తమ వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకోవడం జరిగింది. ఇక కొన్ని ఆశ్చర్యాన్ని కలిగించే విషయాలు కూడా లేకపోలేదు. ఇక ఎపిసోడ్లో భాగంగా బాలకృష్ణ, చంద్రబాబు నాయుడుతో మీరు లైఫ్ లో మీరు చేసిన మోస్ట్ రొమాంటిక్ పని ఏంటి? అని చంద్రబాబుని అడగగా.. మీకంటే ఎక్కువే చేశాను. అయితే మీరు సినిమాల్లో చేశారు.. కానీ నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు చేశాను.. అంటూ అసలు విషయాన్ని బయటపెట్టారు.
ఇక కాలేజ్ చదువుకునే రోజుల్లో..అమ్మాయిలు కనిపిస్తే సైలెన్సర్ తీసేసి, కీక్ కీక్ అంటూ హారన్ చేసేవాళ్ళం అని చంద్రబాబు తెలిపారు. ఇక చంద్రబాబు ఈ మాట అనగానే షోలో ప్రేక్షకులంతా ఒక్కసారిగా నవ్వడం మొదలుపెట్టారు . ఇక ఇవే కాదు ఎన్నో విషయాలు వీరిమధ్య మంచి హాస్యాన్ని సృష్టించాయి. ఆద్యంతం ఈ షో మొత్తం సందడిగా సాగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో కూడా వైరల్ అవుతూ ఉండగా పూర్తి ఎపిసోడ్ శుక్రవారం ప్రసారం కానుంది.