సమంత ఎదురైతే ఆ మాట చెప్తాను.. చైతూ..!!

-

నాగచైతన్య – సమంత ప్రస్తుతం విడిపోయి ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్న విషయం తెలిసిందే.ఈ క్రమంలోని టాలీవుడ్ యువ సామ్రాట్ నాగచైతన్య ప్రస్తుతం బాలీవుడ్ లో అమీర్ ఖాన్ హీరోగా నటించిన లాల్ సింగ్ చద్దా సినిమాలో బాలరాజు అనే పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా ఆగస్టు 11వ తేదీన తెలుగు, తమిళ్, హిందీ భాషలలో విడుదల అవుతున్న నేపథ్యంలో చిత్ర బృందం సినిమా ప్రమోషన్స్ శెరవేగంగా చేపట్టారు. ఈ సినిమాలో కరీనాకపూర్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక్కొక్కరు ఒక్కో విధంగా సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే తాజాగా చైతన్యకు సమంతకు సంబంధించిన ఒక ప్రశ్న ఎదురవగా ఆయన ఒక మాట చెబుతాను అంటూ అందరికీ షాక్ ఇచ్చారు.

ఇక అసలు విషయంలోకి వెళ్తే.. గత కొన్ని రోజులుగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న చైతన్య ఇప్పుడు లాల్ సింగ్ చద్దా సినిమా గురించి మాత్రమే కాకుండా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రశ్నలు కూడా ఎక్కువగా ఎదుర్కోవాల్సి వస్తుంది. పర్సనల్ లైఫ్ కి సంబంధించిన ప్రశ్నలతో తాను విసిగిపోయాను అంటూ అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కానీ తాజాగా మరొకసారి మళ్ళీ సమంత గురించి ఒక ప్రశ్న ఎదురవడం జరిగింది. చైతన్యకు రాపిడ్ ఫైర్ రౌండ్ లో భాగంగా సమంత మళ్ళీ ఎదురైతే ఏం చేస్తారు? అని యాంకర్ అడిగింది.Samantha Akkineni Shares A Heartmelting Wish For Naga Chaitanya On Their Third Wedding Anniversary

అందుకు నాగచైతన్య హాయ్ చెబుతానని చెప్పాడు. అలాగే తన వ్యక్తిగత జీవితం , వృత్తిపరమైన జీవితంపై ప్రభావం చూపించకుండా ఉండేలా జాగ్రత్త పడుతున్నట్లు కూడా తెలిపారు. ఇక చాలామంది పర్సనల్ లైఫ్ కు వృత్తిపరమైన జీవితానికి కనెక్ట్ చేస్తారని, తాను ఎప్పటికీ అలా చేయనని ఈ రెండిటి మధ్య చాలా స్పష్టమైన అడ్డంకి ఏర్పాటు చేశానని ఆయన తెలిపారు.ఏది ఏమైనా నాగచైతన్య సమంత మళ్ళీ కలవాలని ఇప్పటికీ కోరుకునే అభిమానులు కూడా ఉన్నారు అని చెప్పవచ్చు .

Read more RELATED
Recommended to you

Exit mobile version