గౌతమ్ ఆదానిపై చర్యలకు ఖచ్చితమైన సమాచారం ఆధారాలుంటే చర్యలు తీసుకుంటాను అన్న ఏపీ సీఎం చంద్రబాబు మాటలు ఈ దశాబ్దపు పెద్ద జోక్ అని ఏపీ కాంగ్రెస్ చీప్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. నాడు ప్రతిపక్షంలో ఉండగా ఏ సమాచారంతో విద్యుత్ ఒప్పందాలపై కోర్టుకు వెళ్లారని ఆదానితో చేసుకున్న ఒప్పందాల్లో అవినీతి దాగి ఉందని ఎందుకు అన్నారని చంద్రబాబును షర్మిల ప్రశ్నించారు. అదా నీ పవర్ ఎక్కువ రేటు పెట్టి కొనడంతో రాష్ట్ర ప్రజలపై లక్ష కోట్ల రూపాయల భారం పడిందని ఆనాడు ఎందుకు చెప్పారని ప్రశ్నించారు. తాడేపల్లి ప్యాలెస్ వేదికగా రాష్ట్రాన్ని ఆదానికి దోచుపెడుతున్నారని ఎందుకు ఆరోపణలు చేశారని నిలదీశారు షర్మిల.
ప్రతిపక్షంలో ఉండగా అతని మీకు శత్రువు.. అధికారపక్షంగా అదే ఆదాని మిత్రుడు అయ్యాడని పేర్కొన్నారు. గాదా ప్రభుత్వం సేకి తో చేసుకున్న ఒప్పందంలో అవినీతి జరిగిందని.. అలా అని పవర్ తో చేసుకున్న అగ్రిమెంట్ వెనక స్వయంగా మాజీ ముఖ్యమంత్రి 1700 కోట్ల ముడుపులు తీసుకున్నారని అమెరికన్ దర్యాప్తు సంస్థ ఎఫ్బిఐ స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చిందని.. అమెరికన్ కోర్టులో అదానిపై కేసులు కూడా పెట్టారని షర్మిల గుర్తు చేశారు. ఇంత తాతంగం నడుస్తుంటే అన్ని ఆధారాలు కళ్ళముందు కనిపిస్తుంటే అలా నీ మోసానికి రాష్ట్రమే అడ్డగా మారితే మాజీ సీఎం లేరుగా అవినీతిలో భాగంగా ఉంటే కచ్చితంగా కావాలని చంద్రబాబు అడగటం రాష్ట్ర ప్రజలను మోసం చేసినట్టే అవుతుందని విమర్శించారు షర్మిల.