దేశానికే మోడల్ గా కొహెడ మార్కెట్ : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

-

కల్తీ ఆహారం పై హైదరాబాద్ నగరంలో జీహెచ్ఎంసీ  స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ఫుడ్ సేఫ్టీ అధికారులు వరుసగా రెండవ రోజు కూడా డ్రైవ్ నిర్వహించి పలు దుకాణాలు, హోటళ్లు, బేకరీలలో కల్తీ ఫుడ్ ను సీజ్ చేసి..కేసులు నమోదు చేశారు. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ కుత్బుల్లాపూర్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి తనిఖీల్లో పాల్గొన్నారు.

జీపీ ఫుడ్స్ లో పెద్ద ఎత్తున కల్తీ ఆహార పదార్థాలను తమ తనిఖీల్లో గుర్తించిన అధికారులు వాటిని సీజ్
చేశారు. ఈ సందర్భంగా మేయర్ విజయలక్ష్మీ మాట్లాడుతూ.. నగరంలో హోటల్స్, రెస్టారెంట్లు, బేకరీలు, తినుబండారాల దుకాణాల్లో ఫుడ్ కల్తీ ఘటనలు సాధారణంగా మారాయని, నిషేధిత పదార్ధాలను తినుబండారాల తయారీలో వినియోగిస్తున్నారని, నాసిరకం పదార్ధాలతో ఆహారం తయారు చేస్తున్నారన్నారు. రస గుల్లల్లో నిషేధిత కలర్స్ వినియోగిస్తుండటం ఆందోళనకరమన్నారు. ఆహార కల్తీ నియమ నిబంధనలు తెలిసి కొందరు.. తెలియక కొందరు కల్తీకి పాల్పడుతున్నారన్నారు. ఈ రోజుల్లో అస్వస్థతకు గురై ఆసుపత్రుల పాలైతే లక్షల్లో ఖర్చు అవుతుందన్నారు. అందుకే ఆహార కల్తీ పై కఠినంగా వ్యవహరించాల్సి ఉందని, అటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version