ప్రేమ లో పడ్డామంటే ఆ పని అస్సలు చేయకూడదు – రకుల్..!

-

ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకొని కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే బాలీవుడ్ కి వెళ్ళిపోయి అక్కడ అవకాశాలు అందుకుంది. అయితే ఇప్పుడు మళ్ళీ సౌత్ సినిమాలపై మనసు పడిందో ఏమో కానీ తరచుగా ఇక్కడి ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రోజుకొక గ్లామర్ ఫోటోషూట్ పంచుకుంటూ నిత్యం హాట్ టాపిక్ గా మారుతుంది. అయితే తాజాగా ఈమె ప్రేమలో పడినప్పుడు అలాంటి పనులు అస్సలు చేయకూడదంటూ చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.

తాజాగా ఈమె ప్రముఖ బాలీవుడ్ నిర్మాత నటుడు ఆయన జాకీ భగ్నానీ తో ప్రేమాయణం నడుపుతున్న విషయం తెలిసిందే. త్వరలోనే వీరిద్దరూ వివాహం కూడా చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తన ప్రేమను ఒక సందర్భంలో తానే స్వయంగా ప్రకటించిన ఈమె తాజాగా ప్రేమ గురించి ప్రేమలో జరిగే మోసాల గురించి కూడా సంచలన కామెంట్లు చేసింది.. ఈ సందర్భంగా రకుల్ మాట్లాడుతూ.. ప్రేమలో పడ్డామంటే అబద్ధాలు అస్సలు చెప్పకూడదు.. ఇద్దరు వ్యక్తులు ప్రేమలో ఉన్నప్పుడు ఏ విషయంలో అయినా దాపరికాలు ఉండకూడదు అంటూ రకుల్ చెబుతోంది.

అంతేకాదు ఒకవేళ దాపరికాలు ఉన్నట్లయితే వారి ప్రేమ ఎక్కువ కాలం నిలవదని.. మనిషి తప్పు చేయకుండా ఉండలేడు.. మనిషి అన్న తర్వాత తప్పులు చేయడం సహజం కానీ ఆ చేసిన తప్పులను ఒప్పుకోవడం చాలా గొప్ప విషయం అంటూ తెలిపింది రకుల్.. అంతేకాదు ప్రేమలో ఉన్నప్పుడు ఆ తప్పు ఒప్పుకోకపోవడమే ఆ ప్రేమకు ఒక పెద్ద సమస్య అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈ ప్రపంచంలో చాలామంది జంటలు విడిపోవడానికి కారణం కూడా ఒక అబద్ధమే కాదు చేసిన తప్పును ఒప్పుకోకపోవడమే అంటూ చెబుతోంది. ఏది ఏమైనా రకుల్ చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version