వశిష్ట్ కి కళ్యాణ్ రామ్ ఇచ్చిన పారితోషికం ఎంతో తెలిస్తే..షాక్..!!

-

బింబిసార సినిమాతో డైరెక్టర్ వశిష్ట్ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రేసులోకి వచ్చేసారని చెప్పవచ్చు. మొదటి సినిమాతోనే స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న వశిష్ట్.. ఇప్పటికీ కూడా బింబిసారా సినిమా థియేటర్లలో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతుందని చెప్పడంలో సందేహం లేదు. ముఖ్యంగా కళ్యాణ్ రామ్ సినీ కెరియర్ లోనే ఇదొక బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీ అని చెప్పవచ్చు. ఇకపోతే ఇప్పటికే రూ.35 కోట్ల షేర్ వసూలు చేసి రూ. 40 కోట్ల రికార్డులు బద్దలు కొట్టడానికి దగ్గర్లో ఉన్న ఈ సినిమా.. మరొకవైపు.. ఇప్పటికే కళ్యాణ్ రామ్ ఈ సినిమాకు సీక్వెల్ ను కూడా ప్రకటించడం జరిగింది.. ఇకపోతే ఈ చిత్రానికి కూడా వశిష్ట్ దర్శకత్వం వహిస్తూ ఉండగా కొత్త దర్శకులను ఎంకరేజ్ చేసే ప్రయత్నంలో కళ్యాణ్ రామ్ ఎప్పుడు ముందుంటాడు.ఇకపోతే కళ్యాణ్ రామ్ ఎంకరేజ్ చేసిన దర్శకులలో సురేందర్ రెడ్డి , అనిల్ రావిపూడి వంటి వారు స్టార్ డైరెక్టర్స్ గా ఉన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు కూడా కొత్త దర్శకుడి వశిష్ట్ ని తెలుగు తెరకు పరిచయం చేసి కళ్యాణ్ రామ్ ఒక అద్భుతం సృష్టించాడనే చెప్పాలి. ఇక కళ్యాణ్ రామ్ బింబిసారా సినిమాకి గాను వశిష్ట్ రెమ్యూనరేషన్ విషయం తాజాగా వైరల్ గా మారుతుంది. ఇకపోతే బింబిసారా సినిమా కోసం డైరెక్టర్ వశిష్ట్ నెల జీతానికి పనిచేశాడు. సినిమా విడుదలైన తర్వాత ఘన విజయం సాధించడంతో కళ్యాణ్ రామ్ కి అధిక లాభాలు తెచ్చి పెట్టింది ఈ సినిమా. ఇక దాంతో దర్శకుడికి భారీగానే ముట్ట చెప్పినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ చిత్రానికి సీక్వెల్ విషయానికి వచ్చేసరికి వశిష్ట్ కి ఏకంగా మూడు కోట్ల రూపాయలు రేమ్యునరేషన్ ను కళ్యాణ్ రామ్ ఆఫర్ చేశాడట. దీంతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తీస్తున్న రెండవ సినిమాతోనే ఈ రేంజ్ లో పారితోషకం అందుకోవడం అనేది మామూలు విషయం కాదు. ఇక దర్శకుడు వశిష్ఠకి కళ్యాణ్ రామ్ మూడు కోట్లు ఆఫర్ చేయడంతో అందరూ ఆశ్చర్యం కూడా వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version