రూ.5 లక్షల ప్రభుత్వ ఇన్సూరెన్స్… వివరాలివే..!

-

ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన స్కీమ్ వలన చాలా లాభాలను పొందొచ్చు. అయితే ఇక ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన స్కీమ్ తాలూకా లాభాలను పొందడం ఇప్పుడు మరెంత ఈజీగా మారింది. అయితే మరి మీరు అర్హులా కాదా అనేది ఇలా తెలుసుకోండి.

ఏ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండానే మనం చెక్ చేసుకోవచ్చు. అలానే స్కీమ్ ఏయే ఆసుపత్రుల్లో అందుబాటుల్లో వుంది అనేది కూడా ఈజీగా తెలుసుకోవచ్చు కూడా. మీ వద్ద పేటీఎం యాప్‌ ఉంటే సరిపోతుంది. డిజిటల్ పేమెంట్ కంపెనీ పేటీఎం ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజనను అందిస్తోంది. ఇక పూర్తి వివరాల లోకి వెళితే…

ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్సూరెన్స్‌ తో పేటీఎం యాప్ జత కట్టింది. ఈ స్కీమ్ కిందనున్న ప్రైవేట్, ప్రభుత్వం ఆసుపత్రుల వివరాలను చూసుకోవచ్చు. అలానే ఈ స్కీమ్ కిందకి వచ్చే ఆసుపత్రులు ఏవి అనేది కూడా చూసుకోవచ్చు. ఈ పధకం కింద ఒక్కో కుటుంబం రూ.5 లక్షలను హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ కింద సంవత్సరానికి పొందొచ్చు. రోగుల వైద్య ఖర్చులు, ఆసుపత్రుల ఖర్చులు, ఆహార సౌకర్యాలు, మందులు వంటివి కేంద్రం అందిస్తుంది. అలానే పేటీఎం నుండి హెల్ప్ లైన్ నెంబర్ 14555 కి ఫోన్ చెయ్యచ్చు.

ఎలా సమాచారం పొందాలి అనేది చూస్తే..

దీని కోసం మొదట పేటీఎం యాప్‌లోకి వెళ్లి లాగిన్ అవ్వాలి.
యాప్‌ని స్క్రోల్ డౌన్ చేసి పేటీఎం హెల్త్‌లో ఉన్న పీఎంజేఏవై ఆప్షన్‌ పైన క్లిక్ చెయ్యాలి. సెర్చ్ బార్‌లో పీఎంజేఏవైని అని సెర్చ్ చేసి.. ఎలిజిబులిటీ ఆప్షన్‌పై నొక్కండి.
నెక్స్ట్ రాష్ట్రం పేరుని ఎంటర్ చేసి పేరు, రేషన్ కార్డు నెంబర్, ఇంటి ఐడీ నెంబర్ వంటి వివరాలను ఎంటర్ చెయ్యాలి.
మీ ఫ్యామిలీ మెంబర్లతో పాటుగా అర్హతను కూడా మీరు చూడచ్చు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version