బిగ్ బాస్ 8 కంటెస్టెంట్ ప్రేరణ గురించి ఎవరికీ తెలియని విషయాలు ఇవి..!

-

బిగ్బాస్ సీజన్ 8 ప్రారంభమైంది. ఈసారి అన్ లిమిటెడ్ అంటూ హోస్ట్ నాగార్జున కాంటెస్టెంట్లలో ధైర్యాన్ని నింపి హౌస్ లోకి తీసుకురావడం జరిగింది. ఒక్కొక్కరిగా కాకుండా ఈసారి ఇద్దరిద్దరుగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ క్రమంలో బిగ్ బాస్ 8 లోకి నాలుగవ కంటెస్టెంట్ గా ప్రేరణ ఎంట్రీ ఇచ్చారు. ప్రేరణ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు ఆమె అందరికీ సూపర్హితమే. ఆమె కన్నడ నటి అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది ప్రేరణ గురించి చాలామందికి తెలియని విషయాలు ఇప్పుడు చూద్దాం.

1996 జూన్ 18న ఈమె పుట్టారు. పుట్టింది హైదరాబాద్ లో అయినప్పటికీ ఆమె కర్ణాటకలో పెరిగారు. 2017 లో కన్నడ సీరియల్ హర హర మహాదేవలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత రంగనాయకి అనే సీరియల్ లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు 2018 లో ఈమె చురకత్తే అనే కన్నడ సినిమాలో నటించారు. ఫిజిక్స్ టీచర్, పెంటగాన్ వంటి మూవీస్ లో ఈమె నటించింది.

ప్రేరణ ప్రస్తుతానికైతే బానే యాక్టివ్ గా కనబడుతున్నారు. రానున్న రోజుల్లో ఆమె టాస్క్స్ లో ఎలా పెర్ఫార్మన్స్ ఇస్తారు..? అందరితో ఎలా కలుస్తారు అనే దాని గురించి చూడాలి. 2021లో ప్రేరణ కన్నడ బిగ్ బాస్ లో పాల్గొన్నారు. ప్రస్తుతం బిగ్బాస్ సీజన్ 8 లోకి ఎంట్రీ ఇచ్చి టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఉండాలని ట్రై చేస్తున్నారు. మరి ప్రేరణకి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఎంతవరకు కలిసి వస్తుంది..? ఆడియన్స్ ఆమెకి ఎంతవరకు సపోర్ట్ ఇస్తారు అనే విషయాలు చూడాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version