ఇంటర్నేషనల్ అవార్డ్స్: అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న రష్మిక..!

-

తాజాగా నెదర్లాండ్స్ కి చెందిన సెప్టిమిస్ అవార్డ్స్ నామినేషన్స్ లో మన నటీనటులు కూడా నిలవడం ప్రశంసనీయమని చెప్పవచ్చు. ఇకపోతే ఈ మధ్యకాలంలో మన సినిమాలు, మన నటీనటులు కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్న విషయం తెలిసిందే. అలాగే ప్రపంచంలోనే పలు ఇంటర్నేషనల్ అవార్డులను , జాతీయ అవార్డులను కూడా గెలుచుకుంటున్నారు. ఈ క్రమంలోనే సెప్టిమిస్ అవార్డ్స్ నామినేషన్ లో కూడా నిలవడం గమనార్హం.

నెదర్లాండ్స్ కి చెందిన ఈ సంస్థ ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ పరిశ్రమలకు సంబంధించి కొన్ని విభాగాలలో ఉత్తమ అవార్డులను ఇస్తున్న విషయం తెలిసిందే. ఈసారి కూడా బెస్ట్ ఆసియన్ యాక్ట్రెస్ నామినేషన్ లో ఇండియా నుంచి రష్మిక మందన్న తో పాటు నమిత లాల్ అనే ఒక బాలీవుడ్ నటి కూడా నిలిచింది. బెస్ట్ ఆసియన్ యాక్టర్ నామినేషన్ లో హీరో టోవినో థామస్ నిలవగా.. అలాగే బాలీవుడ్ కమెడియన్ భువన్ భమ్ కూడా నిలిచారు.

ఇక బెస్ట్ ఆసియన్ ఫిలిమ్స్ లో ఇటీవల మలయాళం నుంచి వచ్చి దేశవ్యాప్తంగా మంచి విజయం సాధించిన 2018 ఫిలిం కూడా నిలవడం గమనార్హం. ఇకపోతే ఈ విషయం తెలిసి వీరి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు వీరు ఈ అవార్డ్స్ ని గెలుస్తారో లేదో తెలియదు కానీ ఇంటర్నేషనల్ లెవెల్ లో నామినేషన్స్ వరకు వెళ్లడమే చాలా గొప్ప అంటూ వీరిపై ప్రశంసలు కురిపిస్తున్నారు అభిమానులు. ఇకపోతే ఈ అవార్డ్స్ వేడుక సెప్టెంబర్ 26వ తేదీన జరగబోతోంది.

Read more RELATED
Recommended to you

Latest news