ఆమె వల్లే త్రిష తన బాయ్ ఫ్రెండ్ నుంచి దూరం అయ్యిందా..?

-

ప్రముఖ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. అయితే ఇటీవల త్రిష బాయ్ ఫ్రెండ్ తో డేటింగ్ చేశాను అంటూ తెలుగమ్మాయి బిందు మాధవి చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. బిందు మాధవి టాలీవుడ్ లో టాప్ హీరోయిన్గా నిలదొక్కుకోలేక తమిళ్లో సినిమాలు చేసింది. తర్వాత బిగ్బాస్ ఓటిటి సీజన్ విన్నర్ గా నిలిచి ఇప్పుడు కెరియర్ లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. అంతేకాదు టాలీవుడ్లో హీరోయిన్గా స్ట్రాంగ్ అవుతానంటూ కామెంట్ కూడా చేస్తోంది.

న్యూసెన్స్ అనే వెబ్ సిరీస్ తో మే 12వ తేదీన ఆహా లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న బిందు మాధవి.. ఈ సిరీస్ కి సంబంధించిన యూనిట్.. జోరుగా ప్రమోషన్స్ చేస్తున్న నేపథ్యంలో హైదరాబాదులో ప్రెస్ మీట్ నిర్వహించారు. అందులో ఊహించని ప్రశ్నలు నటీనటులకు ఎదురయ్యాయి. ఇదే సమయంలో హీరోయిన్ బిందు మాధవికి ఒక ప్రశ్న ఎదురయింది.. అదేంటంటే.. త్రిష బాయ్ ఫ్రెండ్ తో మీరు డేటింగ్ చేశారని వార్తలు వచ్చాయి. ఇది నిజమేనా? అని.. అందుకు బిందు మాధవి సూటిగా సమాధానం చెప్పండి.

అవి రూమర్స్ కాదని.. త్రిష మాజీ ప్రియుడు వరుణ్ మణియన్ తో తాను నిజంగానే డేటింగ్ లో ఉన్నానంటూ బిందు మాధవి అంగీకరించింది. నేను నిజంగానే వరుణ్ మణియన్ తో డేటింగ్ లో ఉన్నాను.. కాకపోతే అది వేరు వేరు సందర్భాల్లో జరిగింది. ఒకే సమయంలో మేమిద్దరం డేటింగ్ లో లేము.. త్రిష బ్రేకప్ అయిన తర్వాత నాతో డేట్ చేశారు.. నిజాన్ని ఒప్పుకోవాల్సిందే కదా.. అంటూ బిందు మాధవి సమాధానం చెప్పింది. ఏదేమైనా బిందు మాధవి ముక్కుసూటి తనానికి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version