సుమ చేసిన పనికి సీరియస్ అయినా ఎన్టీఆర్..కారణం..?

-

ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. సినిమా ప్రకటన వచ్చింది కానీ సినిమా షూటింగ్ మాత్రం ఇంకా మొదలు కాలేదు. ఇప్పటికే ఎన్టీఆర్ తో కలిసి సినిమా చేసిన రామ్ చరణ్ అనేక సినిమాలను లైన్లో పెట్టడమే కాకుండా విడుదల ప్రకటనలు కూడా చేస్తున్న నేపథ్యంలో ఎన్టీఆర్ అభిమానులు ఈ విషయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ తాజాగా తన అన్న కళ్యాణ్ రామ్ అమిగోస్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

అక్కడికి వచ్చిన ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ కొరటాల శివ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇవ్వాలి అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేశారు. అసలు విషయంలోకెళితే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అభిమానులు 6 గంటలకల్లా చేరుకుంటారు .అదే హీరోలు ఇతర సినిమా యూనిట్ అంతా రావడానికి సమయం పడుతుంది. కాబట్టి వారిని అదరించడానికి యాంకర్లు నానాతంటాలు పడుతూ ఉంటారు. డైరెక్ట్ గా మైకులు తీసుకెళ్లి అభిమానుల ముందు పెట్టడంతో వారు తమ మనోభావాలను బయటపెడుతూ ఉంటారు. ఈ క్రమంలోని నిన్న అనేకమంది అభిమానులు ఎన్టీఆర్ 30 అప్డేట్ కావాలంటూ కోరడంతో సుమ ఎన్టీఆర్ మాట్లాడుతున్న సమయంలో ఆయనకు ఈ విషయాన్ని చెప్పింది.

అయితే ఎందుకో గాని ఎన్టీఆర్ ఈ విషయంపై సీరియస్ అయ్యాడు. సుమా మీద సీరియస్ గా లుక్కిస్తూ కోప్పడుతున్నట్లు కనిపించింది.. ఎన్టీఆర్ ని కళ్యాణ్ రామ్ సముదాయించేందుకు ప్రయత్నించగా కాస్త స్థిమిత పడినట్లు సమాచారం. ఆ తర్వాత ఎన్టీఆర్ మైకు తీసుకొని అభిమానులు అడగకపోయినా మీరు చెప్పించేసేలాగా ఉన్నారే అంటూ సుమకు కౌంటర్ ఇచ్చారు ఎన్టీఆర్. ఇకపోతే త్వరలోనే అన్ని విషయాలు వెల్లడిస్తాము అని కూడా ఆయన స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version