లైగర్ సినిమా కథ మొదట ఆ హీరో కోసమేనా..?

-

తెలుగు సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఇక ఈయన డైరెక్షన్లో స్టార్ హీరోలు సైతం సినిమాలు చేయడానికి చాలా ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు. తాజాగా లైగర్ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్గా మొట్టమొదటిసారిగా మారబోతున్నారు పూరి జగన్నాథ్. ఇక ఈ సినిమాని పూరి బ్యానర్ పై కరణ్ జోహార్ నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఇక ఇందులో హీరోగా విజయ్ దేవరకొండ, అనన్య పాండే, రమ్యకృష్ణ వంటి వారు కూడా నటించారు.లైగర్ సినిమాలో నటిస్తున్న నటుడు విష్ణు ఈ సినిమాకు సంబంధించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను తెలియజేశారు. లైగర్ సినిమాలో విజయ్ దేవరకొండకు పోటీగా విష్ణు విలన్ పాత్రలో నటించారు. ఇక విష్ణు మాట్లాడుతూ ఈ సినిమాలో ఫైట్స్ సన్నివేశాలు చాలా భయంకరంగా ఉంటాయని తెలియజేశారు. ఇక ఈ సినిమాలో విలన్ గానే కాకుండా ప్రొడక్షన్ బాధ్యతలను కూడా చేపట్టాలని తెలియజేశారు. లైగర్ సినిమా మొదట అల్లు అర్జున్ తో చేయాలని పూరీ జగన్నాథ్ అనుకున్నట్లుగా వార్తలు బాగా వినిపించాయి.అయితే ఈ విషయంపై క్లారిటీ కూడా ఇచ్చారు విష్ణు.

అయితే ఈ సినిమా పై వచ్చిన వార్తలపై వాస్తవం లేదని పూరితో దాదాపుగా 20 సినిమాల కథల వరకు సిద్ధంగా ఉన్నాయని.. ఇక అంతే కాకుండా ఆ లిస్టులో ఏ హీరో తో ఎప్పుడు సినిమా చేయాలని విషయాలు కూడా ఉంటాయని తెలిపారు.

ఆ లిస్టు ప్రకారమే ఆ హీరోతో స్క్రిప్ట్ చెప్తాడని తెలిపారు విష్ణు.. అంతేకానీ ఒకరి కోసం పూరి ఎప్పుడు ఎదురు చూడరని కూడా తెలిపారు. అయితే ఈ సినిమా విజయ్ దేవరకొండ కోసమే రాశారని చెప్పకనే తెలియజేశారు విష్ణు. అయితే అల్లు అర్జున్ పై వచ్చిన వార్తలలో ఎలాంటి వాస్తవం లేదని కూడా చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version