ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. “సలార్” నుంచి బిగ్ అప్డేట్..

-

 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్..ప్రజెంట్ KGF ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ ఫిల్మ్ చేస్తున్నారు. ఈ చిత్రంపైన భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ప్రభాస్ గత చిత్రం ‘రాధే శ్యామ్’ అనుకున్న స్థాయిలో ఆడలేదు.ఈ నేపథ్యంలోనే నెక్స్ట్ ఫిల్మ్ అయిన ‘సలార్’ డెఫినెట్ గా రికార్డులు క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణలోని రామగుండంలో ‘సలార్’ చిత్ర షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయింది. ప్రజెంట్..రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ జరుగుతున్నట్లు సమాచారం. ఇకపోతే ఇందులో హీరోయిన్ గా శ్రుతిహాసన్ నటిస్తోంది. మాలీవుడ్(మలయాళం) మల్టీ టాలెంటెడ్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఇందులో కీలక పాత్ర పోషించబోతున్నట్లు వినికిడి. ఇది ఇలా ఉండగా తాజాగా ఈ సినిమా నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది. ఆగస్టు 15వ తేదీన ఈ సినిమా నుంచి.. 12:58 బిగ్ అనౌన్స్మెంట్ రానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ మేరకు పోస్టర్ కూడా వదిలింది చిత్ర బృందం.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version