తెలుగు చలనచిత్ర పరిశ్రమలో లెజెండ్రీ దర్శకుడిగా మరింత పేరు దక్కించుకున్న స్వర్గీయ దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణరావు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒక దర్శకుడి గానే కాకుండా నటుడిగా, నిర్మాతగా కూడా తన సత్తా చాటిన దాసరి నారాయణరావు తన సినీ కెరియర్లో ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నారు. 150 కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన ఈయన 53 పైగా సినిమాలను నిర్మించడం జరిగింది.
అంతేకాదు సినిమా ఇండస్ట్రీకి పెద్దదిక్కుగా మారిన ఈయన తన తదనంతరం మరెవరూ కూడా ఈ స్థానాన్ని భర్తీ చేయలేకపోతున్నారు అనే కామెంట్లు కూడా ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. ఇకపోతే సీనియర్ ఎన్టీఆర్ , దాసరి నారాయణరావు కాంబినేషన్లో వచ్చిన ఎన్నో సినిమాలు మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. సామాన్య కుటుంబంలో జన్మించిన ఈయన స్వయంకృషితో సినిమా రంగానికే పెద్దదిక్కుగా మారి.. కాంగ్రెస్ తరపున రాజ్యసభకు ఎంపికయ్యారు. కొన్నాళ్లపాటు కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు.
అయితే ఉన్నట్టుండి ఆయన మరణం సినిమా ఇండస్ట్రీకి తీరని లోటును మిగిల్చింది. అసలు విషయంలోకి వెళితే దర్శకుడు రేలంగి నరసింహారావు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దాసరి నారాయణరావు సన్నబడడం కోసం బెలూన్ వేయించుకున్నారు. ఆ సమయంలో సన్నబడ్డారు కానీ ఆరు నెలల తర్వాత బెలూన్ తీసేసి కొత్త బెలూన్ వేయాలని చెప్పారు. అయితే జూనియర్ డాక్టర్లు ఆ బెలూన్ వేయడంతో ఆ బెలూన్ ఫంక్షన్ కావడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చింది. ఆ ఇన్ఫెక్షన్ సోకి ఆయన మరణించారు అంటూ రేలంగి నరసింహారావు వెల్లడించారు. ఒకవేళ బరువు తగ్గడానికి ఆయన మరొక మార్గాన్ని అనుసరించి ఉండి ఉంటే.. కచ్చితంగా ఇలా జరిగి ఉండేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.