తన భార్యను ఇండస్ట్రీకి పరిచయం చేసిన జబర్థస్త్ రియాజ్.. ఫొటోస్ వైరల్..!

-

జబర్దస్త్ ఇప్పటికే ఎంతోమందికి మంచి లైఫ్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఇకపోతే అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్న ఎంతోమందిని ఆదరించి మరీ వారికి ఉన్నత స్థానాన్ని అందజేస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు ఇక ఎవరు ఎలా ఉన్నా సరే వారిలో ప్రతిభ ఉంటే కచ్చితంగా వారిని ఆదరిస్తుంది అని చెప్పవచ్చు ఈ క్రమంలోని ఎంతోమంది ఇండస్ట్రీలోకి వచ్చి జబర్దస్త్ ద్వారా మంచి పాపులారిటీని సంపాదించుకున్నారు అలాంటి వారిలో బుల్లి కమెడియన్ రియాజ్ కూడా ఒకరు . రియాజ్ ఇటీవల తన భార్యను కూడా పరిచయం చేయడం గమనార్హం. సాధారణంగా పండుగలు వచ్చాయి అంటే ప్రముఖ ఎంటర్టైన్మెంట్ చానల్స్ అన్నీ కూడా సందడి చేయడం మొదలుపెడతాయి.

ముఖ్యంగా ఈ షో లన్నీ కూడా ఆర్టిస్టులతో కలకలలాడిపోతాయి. ఇక తెలంగాణలో బోనాల జాతర మొదలై ముగిసిన సందర్భంగా బోనాలు సెలబ్రేషన్స్ ఇటీవల షురూ చేసింది జీ తెలుగు యాజమాన్యం. ఇక జీ తెలుగు వారి జాతర పేరుతో సందడి చేస్తున్న ఈ ప్రోగ్రామ్ కి సీరియల్ ఆర్టిస్టులు, సింగర్స్ ,కమెడియన్స్ చేసిన హడావిడి అంతా కాదు . ముఖ్యంగా ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ ను కూడా పోయిన ఆదివారం రిలీజ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ ఎపిసోడ్ కి విపరీతమైన క్రేజ్ కూడా లభించింది. ఇక ఈ ఎపిసోడ్ లో రియాజ్ తన భార్యను కూడా కొత్త పెళ్లికూతురులా ముస్తాబు చేసి స్టేజ్ పైకి తీసుకొచ్చారు.

ఇక ఈ ఎపిసోడ్ లో రియాజ్ తన భార్య పేరును కూడా రివీల్ చేయడం జరిగింది. తన భార్య పేరు యాస్మిన్ అనగా.. సద్దాం మాత్రం కాదు యాస్మిన్ రియాజ్ అని అనడంతో సద్దామ్ సిగ్గుపడతారు. ఇక యాంకర్ శ్రీముఖి రియాజ్ , సద్దాం ఇద్దరిలో ఎవరు బాగా పెర్ఫార్మన్స్ చేస్తారని అడగగా మరో మాట లేకుండా రియాజ్ భార్య రియాజే అని తెలిపింది. ఇకపోతే ఈ మొత్తం ఎపిసోడ్కి రియాజ్ జంట ప్రత్యేకంగా నిలబడమే కాకుండా వీరిద్దరూ కూడా దండలు మార్చుకొని మరింత ఆకర్షణగా నిలిచారు. ఇక ప్రస్తుతం ఈ ఎపిసోడ్ కూడా బాగా వైరల్ గా మారుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version