Janhvi Kapoor : సూర్య సినిమాలో ‘దేవర’ హీరోయిన్?

-

సూర్య హీరోగా రాబోతున్న పాన్ ఇండియా సినిమా ‘కర్ణ’ లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాకేష్ ఓం ప్రకాష్ దర్శకత్వంలో మహాభారతం ఆధారంగా ఈ సినిమా రూపొందనుండగా, ఇందులో సూర్య కర్ణుడి పాత్రలో కనిపిస్తారని సినీ వర్గాలు చెబుతున్నాయి.

Janhvi Kapoor Has Been Roped In For Surya’s Epic Film Karna

దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం జాన్వీ కపూర్ ఎన్టీఆర్ తో ‘దేవర’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా, దివంగత నటి శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమయ్యారు.

ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి జాన్వీ కపూర్ ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో కూడా సినిమా అవకాశాలను అందుకొని సౌత్ ప్రేక్షకులను కూడా సందడి చేయడానికి సిద్ధమయ్యారు.ఈ క్రమంలోనే ఈమె కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమాలో హీరోయిన్గా నటించే అవకాశాన్ని అందుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news