మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ ప్రచారకర్తగా ఎన్టీఆర్‌

-

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాల్లోనే కాకుండా అప్పుడప్పుడు యాడ్స్​లోనూ కనిపిస్తుంటారు. ఇప్పటికే నవరత్న వంటి యాడ్స్ చేసి కూల్ కూల్​గా ప్రేక్షకులను అలరించారు. ఇటీవల ఇక లీషియస్ మీట్ గురించి కూడా యాడ్​లో కనిపించారు. ఈ యాడ్​కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఈ యాడ్​పై చాలా మీమ్స్ కూడా వచ్చాయి. ఇక తాజాగా తారక్ మరో ప్రతిష్ఠాత్మక కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్​గా నియమితులయ్యారు. ఇంతకీ అదేంటంటే..?

అగ్రగామి ఆభరణాల సంస్థ మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ తమ ప్రచారకర్తగా సినీ హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌ను నియమించింది. మలబార్‌ గ్రూప్‌ ప్రధాన విలువలైన నమ్మకం, పారదర్శకత, శ్రేష్ఠతలకు ఎన్టీఆర్‌ ప్రతిబింబంగా నిలుస్తారని సంస్థ వెల్లడించింది. మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ 30వ వార్షికోత్సవం జరుపుకుంటున్న వేళ, సంస్థ కొత్త ప్రకటనల్లో ఎన్టీఆర్‌ నటించనున్నారు.  అత్యంత విశ్వసనీయ ఆభరణాల బ్రాండ్లలో ఒకటైన మలబార్‌కు మరోసారి ప్రచారకర్తగా వ్యవహరించనుండటం సంతోషం కలిగిస్తోందని ఎన్టీఆర్‌ అన్నారు. జూనియర్‌ ఎన్టీఆర్‌తో భాగస్వామ్యం కుదుర్చుకోవడంపై మలబార్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ ఎంపీ అహమ్మద్‌ హర్షం వ్యక్తం చేశారు. మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌కు 11 దేశాల్లో 320 షోరూమ్‌లు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version