IND Vs PAK : పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం

-

ఛాంపియన్స్ ట్రోపీలో భాగంగా భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య దుబాయ్ వేదికగా మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. తొలుత పాకిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 49.4 ఓవర్లలో 241 పరుగులకు పాక్ ఆలౌట్ అయింది. రిజ్వాన్, షకీబ్ అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పారు. షకీబ్ 62 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు.

టీమిండియా బ్యాట్స్ మెన్లలో రోహిత్ శర్మ (20) పరుగులు ఊహించని బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అలాగే మరో ఓపెనర్ 46 పరుగులు చేశాడు. వీరిద్దరూ ఔట్ అయిన తరువాత విరాట్ కోహ్లీ, శ్రేయశ్ అయ్యర్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడారు. శ్రేయస్ 56 పరుగులు చేసి క్యాచ్ ఔట్ కాగా.. ఆ తరువాత వచ్చిన హార్దిక్ పాండ్యా 8 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. అనంతరం అక్షర్ పటేల్ క్రీజులోకి వచ్చాడు. విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ లో సెంచరీ చేశాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version