జూనియర్ ఎన్‌టి‌ఆర్ కి చాలా చాలా చిరాకు తెప్పించిన అంశం ఇది?

-

 

సాధారణంగా జూనియర్ ఎన్టీఆర్ ఎంత శాంత స్వభావుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ కూల్ గా కనిపించే ఎన్టీఆర్ కే వీరు విసుగు తప్పించారు. కళ్యాణ్ రామ్ హీరోగా సతీష్ వేగ్నేశ దర్శకత్వం వహించిన ‘ఎంత మంచి వాడవురా’ సినిమా ఈ సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేసిన విషయం తెలిసిందే.

 

ఇకపోతే ఆ చిత్ర కథానాయకుడు కళ్యాణ్ రామ్ మాట్లాడుతున్నప్పుడు ఫ్యాన్స్ అంతా ఎన్టీఆర్…. ఎన్టీఆర్ అని గట్టి గట్టిగా అరవడంతో పక్కనున్న ఎన్టీఆర్ కు చాలా కోపం వచ్చినట్లుంది. చివరికి కళ్యాణ్ రామ్ కూడా నన్ను ఎక్కువ సేపు మీరు మాట్లాడనిచ్చేలాగా లేరని చెప్పి ఎన్టీఆర్ చేతికి మైక్ ఇచ్చేసాడు. తన సోదరుడికి జరిగినా దానికి ఎన్టీఆర్ నొచ్చుకున్నాడో ఏమో తెలియదు కానీ అతను మాట్లాడేందుకు ప్రారంభించినప్పుడు గట్టి గట్టిగా అరుస్తున్న ప్రేక్షకులతో కొంచెం కటువుగానే మాట్లాడాడు.

“మీరు అరవడం ఆపుతారా లేకపోతే నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటారా” అని వారిని తీవ్రంగా హెచ్చరించారు. ఆ తర్వాత ఎథావిథిగా తన స్పీచ్ కొనసాగించిన ఎన్టీఆర్ మధ్యలో కూడా వారంతా అరుస్తుంటే ఏం మాట్లాడకుండా సీరియస్ గా వారిని చూస్తూ ఉండిపోయాడు. ఈ మధ్య జరుగుతున్న ఫంక్షన్లలో ఇది చాలా కామన్ విషయం అయినా కూడా తారక్ అభిమానులు కొంచెం అదుపులో ఉండాల్సింది అంటూ నెటిజన్లు భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version