ప్రభుత్వం కంటే ప్రైవేట్ పాఠశాలలు గొప్పవా..? : సీఎం రేవంత్ రెడ్డి

-

నిరుద్యోగ సమస్య తెలంగాణ ఉద్యమాన్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకువెల్లిందని.. రాష్ట్ర సాధనలో నిరుద్యోగులు క్రీయాశీల పాత్ర పోషించారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా ఆయన రవీంద్రభారతిలో లెక్చరర్లకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి నిరుద్యోగులు పునాదులుగా మారారని తెలిపారు. గత ప్రభుత్వానికి ఉద్యమం పట్ల బాధ్యత లేక నిరుద్యోగ సమస్యకు పరిష్కారం దొరకలేదన్నారు.

గత ప్రభుత్వ పెద్దల ఉద్యోగాలు తీస్తేనే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని తాను చెప్పినట్టు సీఎం గుర్తుకు చేశారు. కొత్తగా ఉద్యోగ బాధ్యతలు చేపడుతున్న వారికి సీఎం అభినందనలు తెలిపారు. కొత్త అధ్యాపకులు రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు నడిపించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 50వేలకు పైగా నియామకాలు చేపట్టామన్నారు. ఉద్యోగ నియామకాలకు సంబంధించి కోర్టుల్లో ఉన్న చిక్కుముళ్లను విప్పుతూ సమస్యలు పరిష్కరించామన్నారు. గతంలో సంతలో సరుకులా ప్రశ్న పత్రాలు అమ్మారు అని తెలిపారు. దేశ భవిష్యత్ తరగతి గదుల్లో ఉందని మన పెద్దలు చెప్పారని గుర్తు చేశారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version