ప్రపంచంతో పోటీ పడే విధంగా తెలంగాణను తీర్చిదిద్దాలి : సీఎం రేవంత్ రెడ్డి

-

ప్రపంచంతో పోటీ పడే విధంగా తెలంగాణను తీర్చిదిద్దాలని  సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ లోని రవీంధ్ర భారతిలో లెక్చరర్లకు నియామక పత్రాలు అందజేశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. నిరుద్యోగ సమస్య తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేసేలా చేసింది. తండ్రి, కొడుకు ఉద్యోగాలు తీసేయడంతో మీకు ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు. 57,946 ఉద్యోగాలు నియామకం చేపట్టామని తెలిపారు.

విద్యాశాఖకు మా ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. రాష్ట్రంలో అన్ని కలిపి 29,550 స్కూల్స్ ఉన్నాయని తెలిపారు. రెసిడెన్షియల్ స్కూల్ లో విద్యార్థులకు 40వేలు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. 2036లో ఒలింపిక్స్ నిర్వహించాలని దేశం ప్రయత్నిస్తోందని తెలిపారు. 12 ఏళ్ల మీ యుక్త వయస్సు వృధా అయిందని తెలిపారు. పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు యువతకు పిలుపునిచ్చామని తెలిపారు. న్యాయ స్థానాల్లో చిక్కు ముడులు ఇప్పుకుంటూ వస్తూన్నామని తెలిపారు. 55 రోజుల్లో ఉపాధ్యాయ ఉద్యోగాలు నియామక ప్రకీయ చేపట్టామని తెలిపారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version