కాజ‌ల్ కు ఏమైంది.. ఎవ‌రికి నో చెప్పేస్తానంటోంది?

-

కాజ‌ల్ అగ‌ర్వాల్ ద‌శాబ్దం దాటినా ఇప్ప‌టికీ అదే క్రేజ్‌ని కొన‌సాగిస్తోంది. కెరీర్ మాంచి స్పీడులో వుండ‌గానే చిర‌కాల మిత్రుడు, ఫ్యామిలీ ఫ్రెండ్ గౌత‌మ్ కిచ్లూని వివాహం చేసుకుంది. వివాహం జ‌రిగి దాదాపు ఐదు రోజుల‌వుతోంది. ఈ నేప‌థ్యంలో కాజ‌ల్ సోష‌ల్ మీడియా ఇన్‌స్టాలో పెట్టిన పోస్ట్ వైర‌ల్‌గా మారింది. అక్టోబ‌ర్ 30న వివాహం చేసుకున్న కాజ‌ల్ త్వ‌ర‌లో హనీమూన్ కి వెళుతుంద‌ని అంతా అనుకుంటున్న వేళ సోష‌ల్ మీడియాలో పోస్ట్ పెట్టి షాకిచ్చింది.

ఇప్ప‌టికి మించిపోయింది లేదు. నో చెప్పేస్తా ` అని కాజ‌ల్ పెట్టిన పోస్ట్ ఎందు కోసం.. పెళ్లై ప‌ట్టుప‌ని ప‌ది రోజులు కూడా కాలేదు అప్పుడే నో చెప్పేస్తా అంటోంది ఇంత‌కీ ఏమాక‌థ.. కాజ‌ల్ పోస్ట్ వెన‌కున్న స్టోరీ ఏంట‌ని అంతా ఆరా తీస్తున్నారు. పెళ్లి కుదిరిన ద‌గ్గ‌రి నుంచి ఇన్‌స్టాలో వ‌రుస ఫొటోల‌ని పంచుకున్న కాజ‌ల్ తాజాగా మూడు పేజీల ఓ లెట‌ర్‌ని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. దీంతో కాజ‌ల్‌కు ఏమైంది.. ఎవ‌రికి నో చెప్పేస్తానంటోంద‌న్న చ‌ర్చ మొద‌లైంది.

`ఇప్ప‌టికే ఆల‌స్యంగా స్పందిస్తున్నాన‌ని నాకు తెలుసు. ఇది నేను గ‌తంలోనే చేసి వుండాల్సింది. అయితేనేం నా భావాల్ని లెట‌ర్ రూపంలో ప్ర‌పంచానికి వ్య‌క్త‌ప‌రుస్తున్నందుకు క్ష‌మించండి. ఈవిష‌యాన్ని ఇప్పుడే చెప్ప‌డం మంచిది. ఒక చిన్న వైర‌స్ ప్ర‌పంచాన్ని మార్చేస్తుంద‌ని నేను అస్స‌లు ఊహించ‌లేదు. ప‌రిష్కిరంచ‌లేని కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుతో యుద్దం న‌న్ను భ‌య‌పెడుతోంది. నా ఫ్యూచ‌ర్ ఆలోచ‌న‌ల్ని మార్చేసింది. నాకు ఈ ప్ర‌పంచానికి పెను స‌వాళ్ల‌ని విసురుతోంది. ఈ ప‌రిస్థితిని నేను అంగీక‌రించ‌ను. ఈ భయాన‌క వాతావ‌ర‌ణానికి నో చెప్పేస్తాను` అని పోస్ట్ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version