షారుఖ్ ఇంటి ముందు కల్కి ప్రమోషన్స్

-

స‌లార్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత ప్రభాస్‌ కథానాయకుడిగా తెర‌కెక్కుతున్న తాజా చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. సైన్స్ ఫిక్ష‌న్ జాన‌ర్‌లో వ‌స్తున్న ఈ చిత్రానికి మ‌హాన‌టి సినిమా ఫేమ్ నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్ట‌ర్స్, గ్లింప్స్‌ల‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటుండ‌గా.. మే 09 న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. అయితే ఈ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌ కోసం నాగ్‌ అశ్విన్‌ టీం గ్రాండ్‌ ప్రమోషనల్‌ ప్లాన్‌ రెడీ చేసుకుంది.

ఇప్ప‌టికే ఈ సినిమాలో న‌టిస్తున్న రైడర్స్‌ను బాంబేలోని ఓ ఈవెంట్లో ప్ర‌ద‌ర్శించిన విష‌యం తెలిసిందే. ఈ ప్ర‌మోష‌న్స్‌కు సాలిడ్ రెస్పాన్స్ వ‌చ్చింది. అయితే తాజాగా ఈ రైడ‌ర్స్ బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ఇంటిముందు  నిలుచున్నారు. కల్కి చిత్ర‌బృందం తాజాగా విడుద‌ల చేసిన రిలీజ్ పోస్ట‌ర్‌ను ప‌ట్టుకుని మ‌న్న‌త్  ముందు రైడర్స్ నిలుచున్నారు. దీంతో ఈ ఫోటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ఫుల్ వైర‌ల్‌గా మారాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version