హాలీవుడ్ హీరో రేంజ్ లో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ కు ఎంట్రీ ఇచ్చాడు. బిగ్ బాష్ లీగ్ 2023-24లో భాగంగా సిడ్నీ థండర్, సిడ్నీ సిక్సర్స్ మధ్య మ్యాచ్ కోసం చాపర్ లో వచ్చిన వార్నర్. 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన సోదరుడి పెళ్లికి వెళ్లిన వార్నర్.. చివరి నిమిషంలో మ్యాచ్ కోసం హెలికాప్టర్ లో ఎంట్రీ ఇచ్చాడు. తాను ఎక్కడైతే కెరీర్లో చివరి టెస్ట్ ఆడాడో.. అదే సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో .. థ్యాంక్స్ డేవ్ అని తనకు ఫేర్‌వెల్ చెప్పిన చోటే చాపర్ లో దిగిన వార్నర్.క్రికెట్ లో హిస్టరీ లో ఇలాంటి ఎంట్రీ తొలిసారి జరిగింది. సాధారణంగా ఏ మ్యాచ్ ఆడాల్సి ఉన్నా ప్లేయర్స్ కొన్ని గంటల ముందుగానే స్టేడియానికి చేరుకుని ప్రాక్టీస్ చేసి సిద్ధంగా ఉంటారు. కానీ డేవిడ్ వార్నర్ మాత్రం ఇలా మ్యాచ్ కు ఆలస్యమవుతోందంటూ ఏకంగా హెలికాప్టర్ లో నేరుగా గ్రౌండ్ లోనే దిగడం విశేషం.