కల్యాణ్ రామ్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ .. NKR21 సినిమా నుంచి క్రేజీ వీడియో రిలీజ్

-

నందమూరి కళ్యాణ్ రామ్ ఓ వైపు హీరోగా మరోవైపు నిర్మాతగా రాణిస్తున్నారు. గత ఏడాది దసరా సమయంలో తన 21వ సినిమా కూడా అనౌన్స్ చేశారు. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్పై ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఈ సినిమా చేస్తున్నారు. ఈ మూవీలో సయీ మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తుండగా విజయశాంతి ఓ ముఖ్య పాత్ర చేస్తున్నారు. నేడు సీనియర్ ఎన్టీఆర్ 101వ వర్దంతి సందర్భంగా ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

Fist Of Flame పేరిట మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. షూటింగ్ శరవేగంగా జరుగుతుందని తెలిపారు. కళ్యాణ్ రామ్ చిత్రంలో చాలా పవర్ ఫుల్గా కనిపించబోతున్నారని ఈ గ్లింప్స్ చూస్తే తెలుస్తోంది. మొదట క్లీన్గా ఉన్న కళ్యాణ్ రామ్ చేయి ఆ తర్వాత పిడికిలిగా మారి రక్తంతో తడవడాన్ని హైలైట్ చేశారు. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా ఉంది. మొత్తంగా ఈ NKR21 Fist Of Flame వీడియో ఆకట్టుకునే విధంగా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version