హిట్..ప్లాఫ్లతో సంబంధం లేకుండా టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ వరుస సినిమాలు చేస్తూ నిత్యం టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్నాడు. తాజాగా శోభన్ నటించిన కళ్యాణం కమనీయం కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది. వీరసింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య జోరు ఊపందుకోవడంతో ఈ సినిమాను ఎవరూ పట్టించుకోలేదు.
తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు ముస్తాబవుతోంది. ప్రముఖ ఓటీటీ ఆహాలో ఫిబ్రవరి 17నుండి స్ట్రీమింగ్ కానున్నట్లు తాజాగా అధికారిక ప్రకటన వచ్చింది. ప్రియ భవాని శంకర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు అనీల్‌కుమార్ అల్ల దర్శకత్వం వహించాడు. యూవీ కాన్సెప్ట్ బ్యానర్‌పై రూపొందిన ఈ మూవీ డిజిటల్ రైట్స్ ద్వారా సేఫ్ అయినట్లు తెలుస్తుంది. కేవలం నాన్-థియేట్రికల్ హక్కుల ద్వారానే ఈ సినిమాకు దాదాపు రూ.7 కోట్లు ముట్టినట్లు తెలుస్తుంది. ఈ సినిమా బడ్జెట్ 5కోట్లలోపే పూర్తయింది.