హాలీవుడ్‌ దర్శకుడికి కమల్‌ హాసన్‌ ఆతిథ్యం.. సెంట్రాఫ్‌ అట్రాక్షన్‌గా కొత్తజంట

-

మెక్సికన్‌ డైరెక్టర్‌ అల్ఫాన్సో కారోన్‌ ఇండియాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఆదివారం చెన్నై వెళ్లిన ఆయనకు ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ ఆతిథ్యమిచ్చారు. సంబంధిత ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్ చేశారు. అల్ఫాన్సో తనకు సోదరుడిలాంటివారని కమల్‌.. సుదీర్ఘంగా సినిమా సంగతులు మాట్లాడుకున్నామని, ఆయనతో కలిసి భోజనం చేయడం సంతోషాన్నిచ్చిందని కమల్ అన్నారు. అల్ఫాన్సోకు బంగినపల్లి మామిడి పండ్ల రుచి చూపించానని చెప్పారు.

ఇక ఈ విందులో కమల్ హాసన్తో పాటు దర్శకుడు మణిరత్నం, సంగీత దర్శకుడు ఎ.ఆర్‌. రెహమాన్‌, సినిమాటోగ్రాఫర్‌ రవి కె. చంద్రన్‌, హీరో సిద్ధార్థ్‌, హీరోయిన్‌ అదితిరావు హైదరి ఉన్నారు. ఈ ఫొటోలు నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. లెజెండ్స్‌ మధ్య సిద్ధు – అదితి కొత్త జంట సెంట్రాఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కొంతకాలంగా ప్రేమలో వీరు త్వరలో పెళ్లి పీటలెక్కనున్న సంగతి తెలిసిందే. కమల్‌ హీరోగా దర్శకుడు శంకర్‌ తెరకెక్కిస్తున్న ‘భారతీయుడు 2’ )లో సిద్ధార్థ్‌ కీలక పాత్ర పోషించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version