ఇజ్రాయెల్పైకి ఇరాన్ విరుచుకు పడటంతో పశ్చిమాసియా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దాదాపు 300కు పైగా డ్రోన్లు, క్షిపణులతో దాడికి తెగబడింది. ఇలాంటి దాడికి గురైతే సాధారణంగా ఏ దేశమైనా అల్లాడిపోతుంది. కానీ ఇప్పటికే హమాస్తో భీకర యుద్ధం చేస్తూ గాజాపై విరుచుకు పడుతున్న ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్ దాడికి సులభంగా తిప్పికొట్టింది. వందల కొద్ది డ్రోన్లను, మిసైళ్లను సునాయాసంగా నేలకూల్చింది. అత్యంత పటిష్ఠమైన ఇజ్రాయెల్ బహుళ అంచెల గగనతల రక్షణ వ్యవస్థతో ఇరాన్ దాడులను ఈజీగా తిప్పికొట్టగలిదింది. ఇంతకీ ఆ వ్యవస్థే. ఏం ఉన్నాయంటే..!
ది యారో: అమెరికా రూపొందించిన ఈ గగనతల వ్యవస్థ బాలిస్టిక్ సహా ఏ తరహా దీర్ఘ శ్రేణి క్షిపణులనైనా అడ్డుకోగలదు. భూవాతావరణం వెలుపలా పనిచేసే సామర్థ్యం దీనికి ఉంది.
డేవిడ్ స్లింగ్: అమెరికా తయారు చేసిన ఇది మధ్య శ్రేణి క్షిపణులను అడ్డుకోవడానికి ఉపయోగపడుతుంది.
పేట్రియాట్: చాలా కాలంగా ఇజ్రాయెల్ వినియోగిస్తున్న ఈ రక్షణ వ్యవస్థ విమానాలను, డ్రోన్లు కూల్చడానికి వినియోగిస్తోంది.
ఐరన్ డోమ్: అమెరికా సహకారంతో ఇజ్రాయెల్ తయారుచేసిన ఈ వ్యవస్థ తక్కువ దూరం నుంచి ప్రయోగించే రాకెట్లను అడ్డుకుంటుంది. శత్రుపక్షం రాకెట్లు ప్రయోగించగానే ఈ వ్యవస్థ ఆటోమేటిగ్గా పనిచేయడం ప్రారంభిస్తుంది.
ఐరన్ బీమ్: ఇజ్రాయెల్ కొత్తగా అభివృద్ధి చేసిన ఈ రక్షణ వ్యవస్థ లేజర్ సాంకేతికతతో పని చేస్తుంది. ఇరాన్ శనివారం చేసిన దాడిలోనూ ఈ లేజర్ వ్యవస్థను వాడినట్లు తెలుస్తోంది.