Kangana Ranaut’s Election From Mandi Challenged: Kangana Ranaut: మండి నుంచి ఎంపీగా విజయం సాధించిన బీజేపీ నేత కంగనాకు ఊహించని షాక్ తగిలింది. బీజేపీ నేత కంగనా ఎన్నికను రద్దు..అయ్యేలా కనిపిస్తోంది. లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు కంగనా వేసిన నామినేషన్ పత్రాలు సక్రమంగా లేవని…కిన్నౌర్ నివాసి పిటీషన్ వేశారు. బీజేపీ నేత కంగనా ఎన్నికను రద్దు చేయాలని కూడా కిన్నౌర్ నివాసి పిటీషన్ వేశారు.
అయితే.. దీనిపై తాజాగా విచారణ చేసిన హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. బిజెపి లోక్‌సభ సభ్యురాలు కంగనా రనౌత్‌కి నోటీసు జారీ చేసింది హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు. దీనిపై ఆగస్టు 21లోగా సమాధానం ఇవ్వాలని జస్టిస్ జ్యోత్స్నా రేవాల్ నోటీసు జారీ చేశారు. అంటే అఫిడవిట్ ఇచ్చిన పత్రాలపై బీజేపీ నేత కంగనా క్లారిటీ ఇవ్వకపోతే.. ఆమె ఎంపీ పదవి పోయే ఛాన్స్ ఉంది. కాగా కంగనా రనౌత్ మండి లోక్‌సభ స్థానంలో తన ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్‌పై 74,755 ఓట్ల తేడాతో విజయం సాధించారు. సింగ్‌కు 4,62,267 ఓట్లు రాగా, కంగనా కు 5,37,002 ఓట్లు వచ్చాయి.