నేను మూడు జాతీయ అవార్డులందుకున్నానని మరిచిపోకు అమీర్ ఖాన్.. కంగనా రనౌత్

-

బాలీవుడ్ లేడీ క్విన్ కంగనా రనౌత్ మరొకసారి వార్తల్లో నిలిచింది సూపర్ స్టార్ అమీర్ ఖాన్ పై తనదైన శైలిలో విసురుతూ విమర్శలు గుప్పించింది.

బాలీవుడ్ లో ఎప్పుడూ ఏవో ఒక వివాదాలతో వార్తల్లో నిలుస్తూ వచ్చే నటి కంగనా రవ్వతో ఇప్పటికే పలువురు సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ తనదైన శైలిలో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే అయితే మరొకసారి సూపర్ స్టార్ అమీర్ ఖాన్ పై విరుచుకుపడ్డారు..

వివరాల్లోకి వెళితే.. అసలు కంగనాలను అమీర్ ఖాన్ ను ఎందుకు టార్గెట్ చేశారు అంటే.. ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ సినిమా పరాజయం తర్వాత మీడియాకు కాస్త దూరంగా ఉంటున్నారు ఆమిర్‌ ఖాన్. తాజాగా ఆయన.. రచయిత శోభా డే రచించిన ఓ పుస్తకం విడుదల కార్యక్రమంలో పాల్గొని మీడియాతో కాసేపు సరదాగా ముచ్చటించారు. అయితే ఇందులో భాగంగా ఓ విలేకరి‌.. “ఒకవేళ శోభా డే మీద బయోపిక్‌ తీస్తే ఆమె పాత్రలో బాలీవుడ్ నటీమణులు ఎవరు నటిస్తే బాగుంటుంది” అని ప్రశ్నించాడు. దీనికి గానూ అమీర్ “ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణె, అలియాభట్‌.. వీళ్లు గొప్ప నటీమణులు. నాకు ఈ ముగ్గురే గుర్తుకు వస్తున్నారు. వేరే ఎవరి పేరు తట్టడం లేదు” అని ఆమిర్‌ బదులిచ్చారు. అయితే వెంటనే పక్కనే ఉన్న శోభా డే కంగన పేరు చెప్పగా.. “అవును. కంగన కూడా మంచి నటీమణి” అని ఆయన మెచ్చుకున్నారు.

అయితే దీనికి సంబంధించిన ఒక వీడియో బయటకు రాగా ఈ విషయంపై కంగనా ఫైర్ అయ్యారు.. “అయ్యో పాపం ఆమిర్‌.. నటిగా మూడు జాతీయ అవార్డులు అందుకున్న నా పేరు చెప్పకుండా ఉండటానికి ఎంతో శ్రమించారు. కాకపోతే అది సాధ్యం కాలేదు. నా పేరును ప్రస్తావించినందుకు థ్యాంక్యూ శోభా. మా ఇద్దరి రాజకీయ భావాలు వేరైనప్పటికీ, నా కళ, శ్రమను ప్రశంసించడంలో ఆమె ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఆమె గొప్పతనానికి ఇది అద్దం పడుతుంది” అని ట్వీట్ చేశారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version