రేణుకాస్వామి హత్యకేసుపై కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర కీలక వ్యాఖ్యలు..!

-

రేణుకాస్వామి హత్య కేసులో కర్ణాటక హోంమంత్రి జీ పరమేశ్వర కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో తగిన ఆధారాలు సేకరించిన తర్వాతే చార్జిషీట్  దాఖలు చేస్తామని సోమవారం స్పష్టం చేశారు. హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్‌ తూగుదీప, హీరోయిన్‌ పవిత్ర గౌడతో పాటు మరో 15 మంది నిందితులుగా ఉన్నారు. ప్రస్తుతం నిందితులందరికీ జూలై 18 వరకు జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. ఈ క్రమంలో హోమంత్రి స్పందిస్తూ ‘నిందితులను అరెస్టు చేశారు. దర్యాప్తు కొనసాగుతున్నది. సాక్ష్యాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఆ తర్వాత మాత్రమే చార్జిషీట్‌ దాఖలు చేస్తారు’ అని పేర్కొన్నారు. ఓ ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ.. ఇంకా విధివిధానాలు ఉన్నాయని.. కేసులో తగిన ఆధారాలు సేకరించాకే చార్జిషీట్‌ వేస్తామన్నారు.

ఈ కేసులో ఎవరినీ కాపాడాల్సిన అవసరం లేదని.. అలా జరగదని ముందే చెప్పానన్నారు. పవిత్ర గౌడకు వచ్చిన మెస్సేజ్‌లు నటుడు దర్శన్‌ కోపం తెప్పించాయని.. దాంతో రేణుకస్వామి హత్యకు గురయ్యారన్నారు. ఇదిలా ఉండగా.. చిత్రదుర్గకు చెందిన రేణుకస్వామి మృతదేహం జూన్‌ 9న సుమనహళ్లిలోని ఓ అపార్ట్‌మెంట్‌ పక్కనే ఉన్న డ్రెయినేజీ వద్ద లభ్యమైంది. జూన్‌ 8న దర్శన్‌ అభిమాన సంఘానికి చెందిన రాఘవేంద్ర అనే నిందితుడు.. హీరో దర్శన్‌ కలవాలనుకుంటున్నాడని రేణుకస్వామికి ఫోన్‌ చేశాడు. ఆ తర్వాత రేణుకస్వామి హత్యకు గురయ్యాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version