కీర్తి చేతిలో రోజాపూలు.. బాయ్​ఫ్రెండ్ ఇచ్చినవేనా అంటూ నెటిజన్ల కామెంట్లు

-

కీర్తి సురేశ్.. దసరా విజయోత్సవంలో ఉన్న ఈ బ్యూటీ ఇటీవలే వెకేషన్ ఎంజాయ్ చేసి వచ్చింది. ప్రస్తుతం ఖాళీగా సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేస్తోంది. అయితే తాజాగా ఈ బ్యూటీ పింక్ కలర్ సల్వార్ కమీజ్​లో ఫొటో షూట్ చేసింది. ఈ ఔట్​ఫిట్​లో కీర్తి రోజా పూవులాగే కనిపించింది. అయితే ఈ ఫొటోషూట్​లో కీర్తి పింక్ కలర్ రోజా పూలను చేతిలో పట్టుకుని క్యూట్ క్యూట్ పోజులిచ్చింది. ఈ ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ప్రస్తుతం కీర్తి లేటెస్ట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు.. ఈ పూలు కీర్తి సురేశ్​ బాయ్ ఫ్రెండ్ ఇచ్చి ఉంటారనీ.. అందుకే వాటితో పోజులిచ్చిందని అంటున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం ఆ పిక్స్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు, దుబాయ్​ వ్యాపారవేత్త ఫర్హాన్ బిన్ లియాఖత్‌తో దిగిన ఫొటోను ఇటీవలే ఇన్​స్టాగ్రామ్​ స్టోరీలో కీర్తి షేర్​ చేసింది. దీంతో వారిద్దరూ ప్రేమలో ఉన్నారని.. త్వరలోనే పెళ్లి చేసుకుంటారని సినీ వర్గాల్లో టాక్​ నడుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version