పెళ్లి పీటలు ఎక్కబోతున్న కీర్తి సురేష్.. వరుడు ఎవరంటే..?

-

మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా అశ్వినీ దత్ తెరకెక్కించిన అద్భుత మహాకావ్యం మహానటి. ఈ సినిమాతోనే కీర్తి సురేష్ ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. అటు తమిళ్ ఇండస్ట్రీలో, ఇటు తెలుగు ఇండస్ట్రీలో దూసుకుపోతూ మరింత పాపులర్ ను సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే ప్రముఖ హీరోయిన్ మేనకా సురేష్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ తన తల్లి ఇన్ఫ్లుయేన్స్ ను కేవలం ఒకటి రెండు సినిమాలకు మాత్రమే ఉపయోగించుకుంది. ఇక తర్వాత తనదైన శైలిలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించింది. కానీ గత కొన్ని రోజుల తర్వాత ఈమె సినిమాలు వరుసగా డిజాస్టర్ అయ్యాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఆమె ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ సినిమాలనే సెలెక్ట్ చేసుకోవడంతో ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపలేకపోయారు.

ఇక ఇటీవల సర్కారు వారి పాట సినిమాతో ఒక మంచి గుర్తింపును అయితే సొంతం చేసుకుంది. ఆ తర్వాత చిన్ని సినిమాతో సెల్వ రాఘవన్ తో కలిసి మళ్ళీ లేడీ ఓరియంటెడ్ చిత్రం చేసింది కీర్తి సురేష్ . ఇక ఆ సినిమాతో కూడా ప్రేక్షకులను బాగా మెప్పించిందని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా ప్రస్తుతం కీర్తి సురేష్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని వార్తలు కోలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. తల్లిదండ్రులు నిశ్చయించిన వరుడితోనే ఏడడుగులు వేయడానికి సిద్ధమవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇకపోతే పెళ్లి కొడుకు ఒక పెద్ద వ్యాపారవేత్తని రాజకీయాల్లో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు అని ప్రచారం.Keerthy Suresh Family Husband Biography Parents children's Marriage Photos

ఇక ఈ వార్తలు గనక నిజమైతే అతి త్వరలోనే కీర్తి సురేష్ పెళ్లికూతురు కాబోతుంది అని..ఆమె ఇంట పెళ్లి భాజలు మోగబోతున్నాయని సమాచారం. ఇదిలా ఉండగా మలయాళం సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈమె ఆ తర్వాత తమిళ్ , తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. చేతినిండా సినిమాలు తో బిజీగా ఉన్న కీర్తి సురేష్ అప్పుడే పెళ్లి చేసుకోబోతోందా అనే వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈమె వయసు 29 సంవత్సరాలు. ఇకపోతే కీర్తి సురేష్ పెళ్లి అనగానే ఆమె అభిమానులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version